IPL 2022 : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా పేరు పొందింది ఇండియన్ ప్రిమీయర్ లీగ్. ఈ ఏడాది ఐపీఎల్ -2022 (IPL 2022 )లీగ్ నిర్వహించేందుకు భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ నిర్ణయించింది.
ఈ మేరకు ఐపీఎల్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ముంబై లోని ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఐపీఎల్ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
దీనికి సంబంధించిన ఐపీఎల్ కమిటీ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సమావేశం విషయాలు వెల్లడించారు. ఊహించని విధంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఐపీఎల్ (IPL 2022 )స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంది.
ఇదే విషయాన్ని ఆయన ప్రకటించారు. వివో స్థానంలో భారత దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ స్పాన్సర్ షిప్ చేజిక్కించుకుందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా రూ. 2200 కోట్లు వెచ్చింది వేలంలో దక్కించుకున్న వివో నుంచి టాటా గ్రూప్ కు బదలాయింపు జరిగింది. ఒక్క ఐపీఎల్ రిచ్ లీగ్ ద్వారానే బీసీసీఐకి భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఐపీఎల్ వేలం నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది.
వచ్చే నెల ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం పాటను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు బ్రిజేష్ పటేల్. కాగా గతంలో ఐపీఎల్ లో 8 జట్లు ఉండేవి. ప్రస్తుతం రెండు కొత్త జట్లు చేరాయి.
అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలకు పర్మిషన్ ఇచ్చింది. ఈ రెండింటి ద్వారా బీసీసీఐకి రూ. 1700 కోట్లు దక్కాయి.
Also Read : మయాంక్ ఆట తీరుపై సన్నీ ఫైర్