WTC Rankings : డబ్ల్యుటీసీ ర్యాంకింగ్స్ లో శ్రీలంక టాప్
నాలుగో టెస్ట్ డ్రాతో ఆస్ట్రేలియా వెనక్కి
WTC Rankings : వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ – డబ్ల్యూటీసీ 2021-23 సంవత్సరానికి గాను పాయింట్ల పట్టికలో ఊహించని షాక్ తగిలింది ఆస్ట్రేలియా జట్టుకు. స్వదేశంలో ఇంగ్లండ్ తో ఆ జట్టు యాషెస్ సీరీస్ ఆడుతోంది.
ఇందులో భాగంగా ఇప్పటి దాకా నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడింది. వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లలో విజయం సాధించి దుమ్ము రేపింది.
దీంతో వైట్ వాష్ చేద్దామని అనుకున్న ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లారు ఇంగ్లండ్ ఆటగాళ్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్. దీంతో నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది.
సేమ్ సీన్ సిడ్నీ వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో సైతం ఆసిస్ కు ఇలాంటి ఘటనే ఎదురు కావడం విశేషం. ఎందుకంటే టీమిండియా ఓడి పోకుండా అశ్విన్, హనుమ విహారిలు గోడలా అడ్డుకున్నారు.
ఇక తాజా ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో ఇప్పటి దాకా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ర్యాంకింగ్స్ లో(WTC Rankings) ఓ మెట్టు దిగజారింది.
ఆసిస్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది శ్రీలంక జట్టు. దీంతో ఆసిస్ కు కేవలం 40 పాయింట్లు మాత్రమే దక్కాయి. 100 శాతం పాయింట్లు కలిగిన శ్రీలంక టాప్ లో నిలిచింది.
శ్రీలంక ఆడిన టెస్టుల్లోనూ వరుసగా గెలుపొందింది. పాకిస్తాన్ 36 పాయింట్లతో మూడో ప్లేస్ దక్కించుకుంది. 53 పాయింట్లతో భారత జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
దక్షిణాఫ్రికా ఐదో స్థానంలోకి వచ్చింది. బంగ్లాదేశ్ , వెస్టిండీస్ , ఇంగ్లండ్ వరుసగా స్థానాల్లో ఉన్నాయి.
Also Read : వాషింగ్టన్ సుందర్ కు కరోనా