INDvsSA 3rd Test : స‌త్తా చాటిన ర‌బాడ రాణించిన కోహ్లీ

223 ప‌రుగుల‌కు భార‌త్ ఆలౌట్

IND vs SA 3rd Test : మూడు టెస్టు సీరీస్ లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో కేప్ టౌన్ లో జ‌రుగుతున్న మూడో టెస్టులో భార‌త జ‌ట్టు 223 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. టీమిండియా (IND vs SA 3rd Test)స్కిప్ప‌ర్ విరాట్ కోహ్లీ రాణించాడు.

ఓ వైపు వికెట్లు పోతున్నా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. మొద‌టి రోజు ద‌క్షిణాఫ్రికా పై చేయి సాధించింది. సీరీస్ నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్ లో స‌ఫారీ బౌల‌ర్లు మ‌రోసారి త‌మ స‌త్తా చాటారు.

ఓపెన‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్, కేఎల్ రాహుల్ త‌క్కువ స్కోర్ కే వెనుదిరిగారు. ఈ స‌మ‌యంలో వ‌చ్చిన పుజారా, కోహ్లీలు ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు.

టీ స‌మ‌యానికి నాలుగు వికెట్ల న‌ష్టానికి 141 ప‌రుగుల‌తో ఉన్న భార‌త జ‌ట్టు చివ‌రి సెష‌న్ లో 82 ప‌రుగుల‌కు ఆరు వికెట్లు కోల్పోయింది.

దీంతో 250 ప‌రుగులు చేస్తుంద‌ని అనుకున్న టీమిండియాను ర‌బడ మ‌రోసారి క‌ట్ట‌డి చేశాడు.

ఇదిలా ఉండ‌గా వెన్ను నొప్పి కార‌ణంగా రెండో టెస్టుకు దూర‌మైన కోహ్లీ మూడో టెస్టుకు అందుబాటులోకి వ‌చ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కోహ్లీ. కెప్టెన్ విరాట్ కు పుజారా స‌హ‌క‌రించాడు.

43 ప‌రుగులు చేసి అవుట్ కావ‌డంతో ర‌న్స్ మందగించాయి. ఆ త‌ర్వాత పంత్ స‌పోర్ట్ తో కోహ్లీ స్కోర్ వేగం పెంచాడు.

ఇక సౌతాఫ్రికా లీడ్ పేస‌ర్ క‌గిసో ర‌బాడ 22 ఓవ‌ర్ల‌లో 73 ప‌రుగులు ఇచ్చి నాలుగు ప్ర‌ధాన వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఈరోజు అత్యుత్త‌మ బౌల‌ర్ గా నిలిచాడు. పేస‌ర్ మార్కో జాన్సెన్ మూడు వికెట్లు తీశాడు.

ఇక మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి స‌ఫారీ స్కిప్ప‌ర్ ఎల్గ‌ర్ 3 ప‌రుగులతో బుమ్రా క్యాచ్ అందుకోవ‌డంతో కీల‌క వికెట్ కోల్పోయింది.

సౌతాఫ్రికా ఒక వికెట్ న‌ష్టానికి 17 ప‌రుగులు చేసింది. మార్క్రామ్ 8 ప‌రుగుల‌తో కేశ‌వ మ‌హ‌రాజ్ 6 ప‌రుగుల‌తో ఉన్నారు.

Also Read : ర‌షీద్ ఖాన్ పై ఆ రెండూ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!