IPL 2022 BCCI : భారత దేశంలో క్రికెట్ ఓ మతం. దేశమంటేనే క్రికెట్. మరి క్రికెట్ కు ఉన్నంత పిచ్చి ఆదరణ ఇంకే ఆటకు లేదు. ఇప్పుడు కార్పొరేట్లకు అందనంత ఎత్తులో ఉంది బీసీసీఐ.
దానిని నియంత్రించే అధికారం కేంద్ర సర్కార్ కు కూడా లేకుండా పోయింది.
స్వయం నియంత్రణ (ప్రతిపత్తి) సంస్థగా భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (IPL 2022 BCCI)వస్తూ వచ్చింది.
ఇప్పటికే దేశంలో నెంబర్ 2 గా వ్యవహరిస్తూ వస్తున్న అమిత్ షా రెండు సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని అనుకున్నారు. అలాగే చేశారు కూడా.
ప్రస్తుతానికి బీసీసీఐకి చీఫ్ గా సౌరవ్ గంగూలీ ఉన్నప్పటికీ చక్రం తిప్పుతోంది మాత్రం అమిత్ షా తనయకుడు జై షా.
ఇక దేశంలో అతి పెద్ద సెక్టార్ గా వ్యాపించి ఉంది సహకార వ్యవస్థ.
అందులో కోట్లాది రూపాయలు మూలుగుతున్నాయి. దానికంటూ ఓ ప్రత్యేక శాఖను తీసుకు వచ్చింది మోదీ సర్కార్.
ఇప్పుడు ఆ శాఖకు అమిత్ షా మంత్రి అన్నమాట. వ్యాపారం, రాజకీయం కలగలిస్తే ఎలా ఉంటుందో దీనిని చూస్తే తెలుస్తుంది.
ఇక బీసీసీఐ ఐపీఎల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు రిచ్ లీగ్ గా ఉన్న ఈ మెగా టోర్నీలో 2021 దాకా 8 జట్లు ఆడాయి. ఇప్పుడు రెండు కొత్త జట్లు చేరాయి.
ఈ రెండు ఫ్రాంచైజీల వల్ల బీసీసీఐకి ఏకంగా 1700 కోట్లు లభించాయి. ఇదే సమయంలో స్పాన్సర్ షిప్ , స్ట్రీమింగ్ , టెలికాస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఆదాయమే. పట్టిందల్లా బంగారమే.
ఇక ఇప్పటి దాకా స్పాన్సర్ గా ఉన్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రూ. 2200 కోట్లకు చేజిక్కించుకుంది. తాజాగా ఐపీఎల్ స్పాన్సర్ (IPL 2022 BCCI)నుంచి తప్పుకుంది.
దీని ద్వారా రూ. 454 కోట్లు అదనంగా సమకూరాయి బీసీసీఐకి. ఇక టాటా గ్రూప్ ఏడాదికి రూ. 335 కోట్లు చెల్లించనుంది.
Also Read : ఐపీఎల్ వేలానికి వేళాయెరా