INDvsSA 3rd Test : కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 5 వికెట్లు తీసి తన పవర్ ఏమిటో చూపించాడు.
దీంతో ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 210 పరుగులకే చాప చుట్టేసింది. అంతకు ముందు టీమిండియా 223 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో కేవలం భారత జట్టుకు (INDvsSA 3rd Test))13 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది.
ఈ స్టార్ పేసర్ దెబ్బకు సఫారీ తల్లడిల్లింది. ఇక సౌతాఫ్రికా కు చెందిన ఎంగిడి 3 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇవ్వడంతో సఫారీ ఇన్నింగ్స్ పేలవంగా ముగిసింది.
మరో వైపు భారత బౌలర్లు బుమ్రాతో పాటు సత్తా చాటారు. 42 పరుగులు ఇచ్చి బుమ్రా 5 వికెట్లు కూల్చాడు. ఉమేశ్ యాదవ్ 64 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. 39 పరుగులు ఇచ్చి షమీ 2 వికెట్లు కూల్చితే 37 పరుగులు ఇచ్చి శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు.
ఇక సఫారీ టీంలో పీటర్సన్ 72 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు గనుక ఆడక పోయి ఉండి ఉంటే దక్షిణాఫ్రికా జట్టు తక్కువ రన్స్ కే చాప చుట్టేసేది.
రబాడా 14 పరుగులు చేస్తే ఒలీవియర్ 4, ఎంగిడి పెవిలియన్ బాట పట్టారు. స్టార్ బౌలర్ షమీ మరోసారి సత్తా చాటాడు మైదానంలోకి వచ్చీ రాగానే మరో ప్లేయర్ ను వెనక్కి పంపించాడు.
Also Read : బీసీసీఐ పట్టిందల్లా బంగారమే