Gautam Gambhir : భారత జట్టు సౌతాఫ్రికా టూర్ లో భాగంగా టెస్టు సీరీస్ తో వన్డే సీరీస్ ఆడనుంది. కేప్ టౌన్ లో మూడో టెస్టు ఆడుతోంది. ఇందులో భాగంగా భారత జట్టు బ్యాటర్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు భారత జట్టు మాజీ క్రికెటర్, లక్నో ఫ్రాంచైజీ మెంటార్ , బీజేపీ ఎంపీ గౌతం గంభీర్(Gautam Gambhir).
ఇప్పటికే పలువురు టీమిండియాకు సారథ్యం వహించిన వాళ్లలో కొందరు కెప్టెన్లు వికెట్ కీపింగ్ కూడా చేసి రాణించిన వారే. ఇందులో ప్రస్తుతం భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ తో పాటు ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు.
ద్రవిడ్ కేఎల్ రాహుల్ కు వికెట్ కీపింగ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు గంభీర్. టెస్టు క్రికెట్ మ్యాచ్ లో వికెట్ కీపింగ్ అనేది అత్యంత ముఖ్యమైనదన్నాడు.
అంతే కాదు ఎంతో ఓపికతో పాటు ఎంతో సంయమనం వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పూర్తి ఫామ్ తో రాణిస్తున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ ను కీపింగ్ గురించి ఆలోచించాలన్నాడు.
ఇది పూర్తిగా కష్టమైనదని పేర్కొన్నాడు. రిషబ్ పంత్ ఇప్పుడు పరుగుల కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. వికెట్ కీపింగ్ చేసిన ఆటగాడు ఓపెనర్ గా ఎలా రాణిస్తాడంటూ ప్రశ్నించాడు గౌతం గంభీర్.
టెస్టు ఫార్మాట్ లో వికెట్ కీపర్ సక్సెస్ ఫుల్ ఓపెనర్ గా మారలేడని పేర్కొన్నాడు. ఇప్పుడు గంభీర్(Gautam Gambhir) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read : బీసీసీఐ పట్టిందల్లా బంగారమే