Sonali Bendre : పాజిటివ్ లుక్ తో సోనాలి హ‌ల్ చ‌ల్

కొత్త పిక్ నెట్టింట్లో హాట్ టాపిక్

Sonali Bendre : ఎవ‌రైనా జీవితంలో ఏదైనా ఎదుర్కోలేని స‌మ‌స్య వ‌స్తే తట్టుకోలేరు. కానీ ప్ర‌ముఖ న‌టి, మోడ‌ల్ అయిన సోనాలీ బెంద్రే (Sonali Bendre)మాత్రం రోజు రోజుకు త‌న‌ను తాను మార్చుకుంటూ వ‌స్తోంది. ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉంటోంది.

ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటుంది. అంతే కాదు త‌న ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ వ‌స్తుంది. తాజాగా సోనాలి బెంద్రే పోస్ట్ చేసిన పిక్ అద్భుతంగా ఉంది.

ఇక ఆమెను క్యాన్స‌ర్ భూతం క‌మ్మేసింది. భారీ ఖ‌ర్చుతో అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి భార‌త్ కు వ‌చ్చింది. సానుకూల దృక్ఫ‌థంతోనే సంతోషం అన్న‌ది ఉంటుంద‌ని పేర్కొంటోంది.

త‌న‌కు న‌చ్చిన విష‌యాల‌ను పంచుకుంటూ ప్ర‌పంచాన్ని ఎంజాయ్ చేస్తూ వ‌స్తోంది. ఈ సోగ‌క‌ళ్ల సుంద‌రి గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఎందుకంటే బొంబాయి సినిమాలో ఇది అర‌బిక్ అందం అంటూ వేటూరి రాసిన పాట‌కు ఏఆర్ రెహమాన్ సంగీతం తోడై సోనాలి బెంద్రేను అగ్ర న‌టిగా మార్చేలా చేసింది.

ఆ త‌ర్వాత తెలుగు, హిందీ సినిమాల్లో న‌టించి మెప్పించింది. ప్రిన్స్ మ‌హేష్ బాబుతో మురారీ బిగ్ హిట్. ఆ త‌ర్వాత రొమాంటిక్ హీరో అక్కినేని నాగార్జున‌తో క‌లిసి న‌టించిన మ‌న్మ‌ధుడు టాప్ లో నిలిచేలా చేసింది.

తెలుగు సినిమాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్ప‌టికీ మ‌న్మ‌ధుడు ఎన్ని సార్లు టెలికాస్ట్ చేసినా రేటింగ్ మాత్రం అదుర్స్. అనారోగ్యం నుంచి బ‌య‌ట ప‌డి త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఈ సుంద‌రిని చూసి నెట్టింట్లో అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఆమె అందాన్ని చూసి విస్తు పోతున్నారు. అందం అంటే శ‌రీరంలో ఉండ‌ద‌ని అది ఆత్మ విశ్వాసంలో ఉంటుంద‌ని అంటోంది సోనాలి బెంద్రే.

Also Read : హీరో శింబుకు అరుదైన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!