Gautam Gambhir : భారత జట్టు మాజీ క్రికెటర్, లక్నో మెంటార్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ (Gautam Gambhir)సంచలన కామెంట్స్ చేశాడు. ప్రధానంగా భారత స్టార్ ప్లేయర్, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఎన్నడూ లేని రీతిలో నిప్పులు చెరిగారు.
నేటి యువతకు ప్రధానంగా వర్దమాన క్రికెటర్లకు ఆదర్శంగా నిలవాల్సిన భారత జట్టు కెప్టన్ ఇలా దారుణంగా ప్రవర్తించడం మంచి పద్దతి కాదని సూచించాడు. కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీ స్లెడ్జింగ్ చేశాడంటూ ఆరోపించాడు.
తన చర్యను పరిపక్వత లేని చర్యగా పేర్కొన్నాడు గౌతం గంభీర్. ఇలాంటి అసంబద్ద చర్యల వల్ల ఎన్నటికీ ఆదర్శ ప్రాయమైన క్రికెటర్ గా ఉండలేడన్నారు. ప్రత్యర్థి జట్టుతో ఆడుతున్న సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నాడు.
ఆ మాత్రం ఓర్పు లేక పోతే ఎలా అని విరాట్ కోహ్లపై మండిపడ్డాడు. సౌతాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ విషయంలో ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నాడు గౌతం గంభీర్. కోహ్లీ రోజు రోజుకు కంట్రోల్ తప్పుతున్నట్లు అనిపిస్తోంది.
స్టంప్స్ వద్ద ఇలా మాట్లాడటం దారుణమని పేర్కొన్నాడు. మూడో టెస్టులో కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ రిప్రీవ్ పొందిన తర్వాత స్టంప్ మైక్ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇంకో వైపు ఎన్నడూ లేని రీతిలో కోహ్లీ 143 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో తక్కువ రన్స్ చేయడం విస్తు పోయేలా చేసింది.
వేల పరుగులు అలవోకగా చేసిన కోహ్లీ ఆట తీరు ఇలా మారిందేమిటంటూ క్రీడాభిమానులు విస్తు పోతున్నారు. మొత్తం మీద గౌతం గంభీర్ (Gautam Gambhir)చేసిన కామెంట్స్ ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : ఐపీఎల్ జరిగేనా యూఏఈలో లేనట్టేనా