Novak Djokovic : వరల్డ్ టెన్నిస్ స్టార్ జొకోవిచ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి అలెక్స్ హాక్ ఇవాళ జోకోవిచ్ వీసాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ప్రపంచ నెంబర్ 1న టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్(Novak Djokovic) ఆస్ట్రేలియా ఓపెన్ కిరీటాన్ని కాపాడు కోలేక పోయాడు. 2019 నుంచి మెల్ బోర్న్ పార్క్ లో వరుసగా టైటిల్ లను గెలుపొందాడు జోకోవిచ్.
తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్ గా నిలిచాడు. టోర్నమెంట్ లో పాల్గొనేందుకు మొదట్లో మినహాయింపును పొందాడు. ప్రస్తుతం నోవాక్ జోకోవిచ్ (Novak Djokovic)కు ఇప్పుడు 34 ఏళ్లు. 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుపొందాడు.
ఈ వారం ప్రారంభంలో ఆస్ట్రేలియాలో ఉండాలనే తన ప్రయత్నంలో న్యాయ పోరాటంలో గెలిచాడు. ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ నుంచి వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
అయితే నోవాక్ జోకోవిచ్ వీసాను మళ్లీ రద్దు చేసేందుకు తన వ్యక్తిగత అధికారాలను వినియోగించుకునే హక్కు ను దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి కలిగి ఉన్నారంటూ ఫెడరల్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.
తనకు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించే జోకోవిచ్ కు సంబంధించి వీసాను రద్దు చేయడం జరిగిందని ఇమ్మిగ్రేషన్ మంత్రి స్పష్టం చేశారు.
మైగ్రేషన్ చట్టం లోని సెక్షన్ 133 సీ – 3 ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇందులో వ్యక్తిగతంగా ఎలాంటి దురుద్దేశం లేదని కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యాను వీసాను రద్దు చేశామన్నారు.
ఆసిస్ నిర్ణయంతో నోవాక్ కు కోలుకోలేని షాక్ తగిలిందనే చెప్పక తప్పదు.
Also Read : ఐపీఎల్ జరిగేనా యూఏఈలో లేనట్టేనా