SAvsIND 3rd Test : భార‌త్ ప‌రాజయం ప‌రిసమాప్తం 

7 వికెట్ల తేడాతో స‌ఫారీ గ్రాండ్ విక్ట‌రీ 

SAvsIND 3rd Test : కేప్ టౌన్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టులో సౌతాఫ్రికా భార‌త్ (SAvsIND 3rd Test)ను ఓడించింది. వ‌రుస‌గా ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో మూడు టెస్టుల సీరీస్ లో 2-1 తేడాతో గెలుపొంది సీరీస్ చేజిక్కించుకుంది.

సెంచూరియ‌న్ లో జ‌రిగిన మొద‌టి టెస్టులో టీమిండియా 113 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధిస్తే జోహెన్న‌స్ బ‌ర్గ్ లో జ‌రిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది.

సీరీస్ మొత్తంలో భార‌త జ‌ట్టు అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది. ఒక ర‌కంగా కొత్త‌గా హెడ్ కోచ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాహుల్ ద్ర‌విడ్ కు చేదు అనుభ‌వం.

మ‌రో వైపు టీ20, వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించిన స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీకి కోలుకోలేని దెబ్బ‌. మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఓవ‌ర్ నైట్ స్కోర్ 2 వికెట్లు కోల్పోయి 101 ప‌రుగుల‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా కీగ‌న్ పీట‌ర్సెన్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

82 ప‌రుగులు చేశాడు. భార‌త్ నిర్దేశించిన 212 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని ఛేదించింది. స‌ఫారీ త‌ర‌పున డుసెన్ 41 ప‌రుగులు చేస్తే బ‌వుమా 32 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు.

త‌మ జ‌ట్టును గెలుపు తీరాల‌కు చేర్చారు. అంత‌కు ముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 198 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి స‌ఫారీ టీం ఈ గెలుపు న‌మోదు చేసింది.

విచిత్రం ఏమిటంటే రెండో టెస్టు తో పాటు మూడో టెస్టు కూడా 7 వికెట్ల తేడాతో పరాజ‌యం పాల‌వ‌డం విశేషం.

Also Read : దంచి కొట్టిన రిష‌బ్ పంత్

Leave A Reply

Your Email Id will not be published!