Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా రంగం మేలు కోరి ఏపీ సీఎం జగన్ రెడ్డిని కలిశానని అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చిరంజీవి(Chiranjeevi) స్పందించారు ఇవాళ. తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అదంతా ఒట్టి పుకారు తప్ప మరొకటి కాదన్నారు.
తాను పాలిటిక్స్ లోకి రావడం జరగదని తేల్చేశారు. చట్ట సభల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదన్నారు. దయచేసి అలాంటి ఊహాగానాలకు ఇక తెర దించాలని కోరారు.
ఇంతటితో వాటికి పుల్ స్టాప్ పెట్టాలని విన్నవించారు. తాను సినిమా రంగానికే పరిమితం కావాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమ కోసం, థియేటర్ల మనుగడ కోసం ఏపీ సీఎం జగన్ ను కలిశాను.
ఆ చర్చలను పక్క దోవ పట్టించే విధంగా రాజకీయ రంగు పులిమేందుకు యత్నించడం మంచి పద్దతి కాదని అన్నారు చిరంజీవి(Chiranjeevi). రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ అదే పనిగా ప్రసారం చేస్తున్నారు.
ఇది సత్య దూరం. తాను సినిమా రంగానికి చెందిన వాడిని. సినిమాలకే అధిక ప్రయారిటీ ఇస్తానంటూ స్పష్టం చేశారు. కేవలం తెలుగు సినిమా బాగు కోసం మాత్రమే కలిశాను తప్ప రాజకీయం చేయాలని కాదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపారు. కేంద్ర మంత్రిగా పని చేశారు.
Also Read : ముద్దులు లేకుంటే మూవీస్ ఆడవా