Rahul Ramakrishna : రాహుల్ రామకృష్ణ పుట్టిన రోజు ఇవాళ. తెలుగు సినిమా రంగంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. నటుడిగా, రచయితగా, సింగర్ గా, లిరిసిస్ట్ గా పలు రంగాలలో ప్రతిభావంతుడిగా పేరు పొందారు.
సికింద్రాబాద్ లో 1991 జనవరి 15న పుట్టారు రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna). విలేకరిగా కూడా పని చేశాడు.
సైన్మా అనే షార్ట్ ఫిలింతో వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ దేవర కొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీలో హీరోకు ఫ్రెండ్ గా నటించాడు.
జాతీయ పురస్కారం పొందిన పెళ్లి చూపులు మూవీలో రెండు పాటలు కూడా రాశాడు రాహుల్ రామకృష్ణ.
తండ్రి యోగా టీచర్. తల్లి ఓ వ్యాపార పత్రికలో అసోసియేట్ ఎడిటర్ గా ఉన్నారు.
హైదరాబాద్ లోని వీజేఐటీ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదివి ఆపేశాడు. పోస్ట్ నూన్, మెట్రో ఇండియా దినపత్రికల్లో జర్నలిస్ట్ గా పని చేశాడు.
హైదరాబాద్ కు పని మీద వచ్చిన జర్నలిస్టులకు ట్రాన్స్ లేటర్ గా సహకారం అందించాడు. హిందూస్తాన్ టైమ్స్ అనుబంధ వెబ్ సైట్ లో రచయితగా కొద్ది కాలం పని చేశాడు.
పాటల రచయితగా, స్కిప్ట్ రైటర్ గా , టీవీ చానళ్లలో వంటల కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా పని చేశాడు. వైవిధ్య భరితమైన ప్రతిభావంతుడిగా పేరొందారు రాహుల్ రామకృష్ణ.
నాటక రంగం అంటే విపరీతమైన ఆసక్తి. అలా నటనతో పరిచయం ఏర్పడింది.
నాటక రచయితలు మధుసూదన్, సాగరి రాందస్ తన గురువులుగా పేర్కొంటాడు. తరుణ్ బాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సైన్మాలో తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఆ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో 2016లో జయమ్ము నిశ్చయమ్మురాలో నటించాడు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డితో క్రేజ్ పెరిగింది. 2018లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, సమ్మోహనంలో నటించాడు.
అమెజాన్ నిర్మించిన గ్యాంగ్ స్టర్ వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషించాడు. 2018లో పరుశురాం తీసిన గీత గోవిందం మూవలో అద్భుతమైన నటనతో మరింత పేరు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna). బిగ్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.
2020లో దిగ్గజ దర్శఖుడు త్రివిక్రం తీసిన అల వైకుంఠపురంలో మూవీలో రాహుల్ రామకృష్ణ నటించి మెప్పించాడు. ఇవే కాకుండా చిలసౌ, హుషారు, మిఠాయి, ప్రెషర్ కుక్కర్, గువ్వ గోరింక, గుడ్ లక్ సఖీ, నెట్, రిపబ్లిక్, స్కైలాంబ్ సినిమాల్లో నటించాడు.
యంగ్ డైరెక్టర్ తీసిన జాతి రత్నాలు మూవీలో దుమ్ము రేపాడు రాహుల్ రామకృష్ణ. ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకున్నాడు ఈ విలక్షణ నటుడు.
Also Read : అక్షరాలతో అగ్గి రాజేసిన అలిశెట్టి