Virat Kohli : భారత జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు టెస్టుల సీరీస్ లో భాగంగా భారత జట్టు సెంచూరియన్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ లో 113 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఆ తర్వాత జోహెన్నస్ బర్గ్, కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో, మూడో టెస్టుల్లో టీమిండియా వరుసగా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉండగా మూడో టెస్టులో పరాజయం పాలైన తర్వాత మీడియాతో మాట్లాడారు విరాట్ కోహ్లీ(Virat Kohli).
బ్యాటింగ్ వైఫల్యం వల్లనే తాము ఓడి పోవడం జరిగిందని చెప్పాడు. ఇందుకు సంబంధించి తాను సాకులు చెప్పాలని అనుకోవడం లేదన్నాడు. ప్రోటీస్ టీం అద్భుతంగా రాణించిందన్నాడు.
వారి బౌలింగ్ అద్భుతమని కొనియాడారు. తాము సైతం గట్టి పోటీ ఇవ్వగలిగామని స్పష్టం చేశాడు. తమ టీంలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, కానీ అవసరమైన సమయంలో రాణించ లేక పోవడం ఓడి పోవడానికి ప్రధాన కారణంగా పేర్కొన్నాడు.
ప్రత్యర్థి జట్టు తమపై తీవ్ర ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యారంటూ కితాబు ఇచ్చాడు కోహ్లీ(Virat Kohli). ఇది తననే కాదు కోట్లాది మంది భారతీయులను తీవ్ర నిరాశకు గురి చేసిందని తాను ఒప్పుకుంటున్నానని తెలిపాడు.
మేం సఫారీని వారి దేశంలో ఓడించ గలమని అంతా నమ్మారు. కానీ వారి నమ్మకాన్ని మేం తీర్చ లేక పోయామని వాపోయాడు కోహ్లీ. డీఆర్ఎస్ వివాదంపై కూడా స్పందించాడు.
మైదానంలో ఉన్న వారికి తప్ప అసలు ఏం జరిగిందనేది బయటి వారికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు విరాట్ కోహ్లీ.
Also Read : జొకోవిచ్ కు షాక్ వీసా రద్దు