ICC T20 World Cup : ఓ వైపు ఐపీఎల్ సంబురానికి బీసీసీఐ రెడీ అవుతుండగా మరో వైపు టీ20 వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ డిక్లేర్ చేసేందుకు సన్నాహాలు స్టార్ట్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ.
తాజాగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించి తాజా అప్ డేట్ ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ సంవత్సరం ఆఖరులో జరగనుంది టీ20 వరల్డ్ కప్(ICC T20 World Cup) . ఇందుకు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది.
ఈ మేరకు టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ను వెల్లడించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇక మెగా టోర్నీకి సంబంధించి వచ్చే ఫిబ్రవరి నెల 7 నుంచి ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది ఐసీసీ. ఇందుకు సంబంధించి లేటెస్ట్ గా టీ20 వరల్డ్ కప్ వీడియోను కూడా పోస్ట్ చేయడం విశేషం.
ఇదిలా ఉండగా ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup)ను ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ను ఓడించి కప్ కైవసం చేసుకుంది. ఈసారి ఆసిస్ వేదికగా జరిగే ఈ వరల్డ్ కప్ లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి.
ఇదిలా ఉండగా వచ్చే అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16న ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ఐసీసీ. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ , కీవీస్ , సఫారీ, ఆఫ్గాన్, ఆసిస్ , బంగ్లా, ఇంగ్లండ్ ఇప్పటికే క్వాలిఫై సాధించాయి.
ఇక శ్రీలంక, విండీస్, నమీబియా, స్కాట్లాండ్ క్వాలిఫై కోసం బరిలో ఆడాల్సి ఉంది.
Also Read : కోహ్లీ తీరుపై గంభీర్ ఆగ్రహం