Chandrasekhar Azad Ravan : యూపీలో రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. అంతకంటే ఎక్కువగా ఓ వ్యక్తి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది యాధృశ్చికం అనుకుంటే పొరపాటు పడినట్లే. నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్న అతడి పేరు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్(Chandrasekhar Azad Ravan).
1986 డిసెంబర్ 3న యూపీలోని సహారన్పూర్ లో పుట్టారు. హక్కుల కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా, న్యాయవాదిగా ఉన్నారు. భీమ్ ఆర్మీని ఏర్పాటు చేశారు.
దానికి జాతీయ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు. 2021 ఫిబ్రవరిలో ప్రసిద్ద అంతర్జాతీయ అమెరికా మ్యాగజైన్ టైమ్ 100 మందితో వర్దమాన నాయకుల జాబితాను ప్రకటించింది.
అందులో చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ కూడా ఒకరు. తన స్వంతూరులో ఆలోచింప చేసే హోర్డింగ్ ఏర్పాటుతో వెలుగులోకి వచ్చాడు. ఆజాద్ తనను తాను దళిత చిహ్నంగా పిలుచుకున్నాడు.
ఆజాద్ దేనికైనా సిద్దం. హంగు ఆర్భాటాలకు విరుద్దం. సామాన్య జీవితమే లక్ష్యం అంటూ నినదించాడు. అదే తన జీవిత లక్ష్యంగా ప్రకటించాడు. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాడు రావణ్.
బాధితుల పక్షాన పోరాటం ప్రారంభించాడు. అంతే కాదు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా నిలిచాడు. ఢిల్లీ, ఘాజీపూర్ సరిహద్దులో రైతులకు బాసటగా ఉన్నాడు.
దేశ వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొనకుండా గృహ నిర్బంధం విధించారు. చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ , వినయ్ రతన్ సింగ్ , సతీష్ కుమార్ కలిసి 2014లో భీమ్ ఆర్మీని స్థాపించారు.
ఇది దేశంలో విద్య ద్వారా దళితుల విముక్తి కోసం పని చేసే సంస్థ. పశ్చిమ యూపీలో దళితుల కోసం ఉచితంగా బడులు నడుపుతోంది. 2019లో వారణాసి నుంచి మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయాలని అనుకున్నాడు.
ఆ తర్వాత ఎస్పీ, బీఎస్పీలకు మద్దతు ఇవ్వాలని ఊరుకున్నాడు. 2020 మార్చి 15న ఆజాద్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేశాడు. బీహార్ లో పోటీ చేయాలని అనుకున్నారు.
పప్పు యాదవ్ కు చెందిన జన్ అధికార్ పార్టీ నేతృత్వంలోని పీడీఏలో చేరనున్నట్లు ప్రకటించాడు. సీఏఏ వ్యతిరేక నిరసనలో పాల్గొన్నందుకు ఢిల్లీలో అరెస్ట్ చేశారు ఆజాద్ ను. అలహాబాద్ కోర్టు ఆజాద్ కు బెయిల్ మంజూరు చేసింది.
ప్రభుత్వం జైలులో పెట్టింది. మొత్తంగా దళితులు, బహుజనుల స్వరంగా ఉంటూ వచ్చారు రవాణ్. ఇప్పుడు ఎస్పీ పొత్తు కుదరక మరోసారి వార్తల్లో నిలిచారు.
Also Read : తెలుగు వాకిళ్లలో సంక్రాంతి కళ కళ