Lata Mangeshkar : కోలుకుంటున్న కోకిల‌మ్మ

కరోనా నుంచి కొంచెం మేలు

Lata Mangeshkar  : భార‌త‌దేశ సినీ సంగీత దిగ్గ‌జం ల‌తా మంగేష్క‌ర్ కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు డిక్లేర్ చేశారు. అయితే ప్ర‌స్తుతం ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ – ఐసీయూలోనే ఉంచి చికిత్స కొన‌సాగిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ఉన్న‌ట్టుండి ఈ గాన కోకిల‌కు క‌రోనా సోకింది. దీంతో ఆమె మ‌నుమ‌రాలు హుటా హుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిట‌ల్ లో చేర్చారు. మ‌రో వైపు ల‌తాజీకి కోవిడ్ తో పాటు నిమోనియా సోకింది.

దీంతో ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి ఎప్ప‌టిక‌ప్పుడు ఆస్ప‌త్రి వైద్యులు, యాజ‌మాన్యం రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిస్తున్నారు. మ‌రో వైపు భార‌త దేశ ప్ర‌ధాని మోదీ సైతం ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరారు.

ల‌తా మంగేష్క‌ర్ (Lata Mangeshkar )ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ప్ప‌టికీ మ‌రో 10 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచుతామ‌ని, అక్క‌డి నుంచే ఆమెకు అన్ని వైద్య సేవ‌లు అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు వైద్యులు.

ట్రీట్మెంట్ కొన‌సాగించ‌నున్న‌ట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ ప్ర‌తీత్ చెప్పారు. నిపుణులైన డాక్ట‌ర్లు ల‌తాజీకి చికిత్స అందిస్తున్నార‌ని వెల్ల‌డించారు. ప‌లు భారతీయ భాష‌ల్లో వేలాది పాట‌లు పాడారు.

ఇదిలా ఉండ‌గా కోట్లాది మంది భార‌తీయులు ల‌తా మంగేష్క‌ర్ (Lata Mangeshkar )త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ల‌తా మంగేష్క‌ర్ కు ఇప్పుడు 92 ఏళ్లు. 2019లో లతాజీకి శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

Also Read : పండుగ వేళ జ‌క్క‌న్న స‌ర్ ప్రైజ్

Leave A Reply

Your Email Id will not be published!