Team India : టీమిండియాకు కోలుకోలేని షాక్ తగిలింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2021-23 సంవత్సరానికి గాను మూడు టెస్టుల సీరీస్ ను 1-2 తేడాతో సఫారీతో పోగొట్టుకుంది. దీంతో భారత జట్టు (Team India)ఉన్న స్థానాన్ని పోగొట్టుకుంది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి దిగజారింది. ఇక కేప్ టౌన్ లో సైతం ఓడి పోయింది. సెంచూరియన్ లో ఫస్ట్ టెస్టులో టీమిండియా విజయం సాధించింది.
కానీ రెండు, మూడో టెస్టుల్లో ఘన విజయాన్ని నమోదు చేసింది సౌతాఫ్రికా. దీంతో భారత జట్టుపై (Team India)సీరీస్ గెలుపొందిన దక్షిణాఫ్రికా ఐదో ప్లేస్ నుంచి ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది.
ఇదిలా ఉండగా నాలుగో ప్లేస్ లో ఉన్న టీమిండియా ఐదో స్థానానికి దిగజారింది. 2021-23 లో భాగంగా జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన 9 మ్యాచ్ ల్లో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్ ల్లో విజయం సాధించింది.
3 మ్యాచ్ ల్లో ఓడి పోయింది. రెండు టెస్టులను డ్రా చేసుకుంది. దీంతో భారత జట్టుకు 49.07 శాతంతో 53 పాయింట్లు సాధించింది. ఇక దక్షిణాఫ్రికా 66.66 శాతంతో 24 పాయింట్లతో టాప్ లోకి దూసుకు వెళ్లింది.
ఇదిలా ఉండగా ఆడిన రెండు టెస్ట్ ల్లోనూ విజయాలు సాధించిన లంక 100 శాతంతో 24 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆసిస్ టీమ్ 83.33 శాతంతో 40 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇక దాయాది పాకిస్తాన్ టీమ్ 36 పాయింట్లతో మూడో స్థానంతో దక్కించుకుంది. తర్వాతి స్థానంలో కీవీస్ , బంగ్లా, విండీస్ , ఇంగ్లండ్ వరుస స్థానాల్లో ఉన్నాయి.
Also Read : భారత టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై