Jay Shah : భారత క్రికెట్ స్టార్ ప్లేయర్, ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా పేరొందిన విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
విరాట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నాడు భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ సెక్రటరీ జే షా(Jay Shah).
ఎప్పుడైతే సౌరవ్ గంగూలీ బీసీసీఐ చీఫ్ గా కొలువు తీరాడో ఆనాటి నుంచీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీకి కొంచెం దూరం పెరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.
ఇందులో భాగంగా భారత జట్టుకు టీ20, వన్డే, టెస్టు కెప్టెన్సీ గా ఉన్న సమయంలోనే కోహ్లీ తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. ఇంగ్లీష్ మీడియా కోడై కూసింది కూడా.
ఇదే సమయంలో యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కోహ్లీకి ఆఖరు అవుతుందని ప్రసారమైన కథనాలను నిజం చేస్తూ విరాట్ గుడ్ బై చెపుతున్నట్లు ప్రకటించాడు.
ఇదే సమయంలో కీవీస్ టూర్ సందర్భంగా గాయం కారణంగా ఆడలేక పోయాడు. ఆ తర్వాత అనూహ్యంగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ రోహిత్ శర్మను టీ20, వన్డే జట్లకు స్కిప్పర్ గా డిక్లేర్ చేశారు.
ఈ నిర్ణయంపై భగ్గుమన్నాడు కోహ్లీ. వర్చువల్ మీడియా వేదికగా తనకు గంట ముందు చెప్పారంటూ ఆరోపించాడు. పనిలో పనిగా బీసీసీఐ చీఫ్ దాదా తనతో మాట్లాడింది అబద్దమని ఆరోపించాడు.
ఆ తర్వాత కేవలం టెస్టు సీరీస్ కు మాత్రమే స్కిప్పర్ ను చేయడంతో మనసు నొచ్చుకున్న కోహ్లీ తాను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
ఇదే సమయంలో బీసీసీఐ సెక్రెటరీ జే షా (Jay Shah)కోహ్లీ నిర్ణయంపై స్పందించాడు. భారత జట్టును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడంటూ కితాబు ఇచ్చారు.
Also Read : టీమిండియా ఓటమి ఓ పీడకల