Virat Kohli : భారత జట్టు దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం ప్రపంచ క్రికెట్ రంగాన్ని విస్తు పోయేలా చేసింది. టీమిండియాకు ఎనలేని విజయాలు సాధించి పెట్టిన అరుదైన నాయకుల్లో కోహ్లీ ఒకడు.
గెలుపు శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎందుకనో సారథిగా ఉండలేనంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్య పోయేలా చేశాడు. కోహ్లీ (Virat Kohli )అభిమానులు మాత్రం కావాలనే తప్పుకునేలా చేశారంటూ శాపనార్థాలు పెడుతున్నారు.
గంగూలీయే దీనికి కారణమంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఆసిస్ టూర్ తర్వాత నుంచి కోహ్లీ ఆటగాడిగా కూడా ఏమంత పర్ ఫార్మెన్స్ లేదు. అది కూడా ఓ కారణం కావచ్చు.
ఎప్పుడైతే ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సమయంలోనే విరాట్ కోహ్లీని తప్పు కోవాలంటూ బీసీసీఐ ఈమెయిల్ ద్వారా కోరిందంటూ ఇంగ్లీష్ మీడియా కోడై కూసింది.
ఈ మేరకు పెద్ద ఎత్తున పతాక శీర్షికల్లో కూడా కథనాలు ప్రచురించాయి, ప్రసారం కూడా చేశాయి. అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకోనున్నట్లు కూడా పేర్కొన్నాయి.
వాటిని నిజం చేస్తూ మనోడు యూఏఈ వేదికగా జరిగిన టీ20 లీగ్ మ్యాచ్ తనకు ఆఖరుదని స్పష్టం చేశాడు. అలా అన్న మరుక్షణమే టీ20, వన్డే మ్యాచ్ లకు సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. దీనిని తప్పు పట్టాడు కోహ్లీ(Virat Kohli ).
ఇదిలా ఉండగా రాజీనామా ప్రకటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏడేళ్ల టెస్టు కెప్టెన్సీ కెరీర్ లో వందకు 120 శాతం కష్టపడ్డానని తెలిపాడు. ప్రస్తుతం ఆశించిన ఫలితాలు రానందుకే తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు కోహ్లీ.
Also Read : కోహ్లీ విజయవంతమైన స్కిప్పర్