Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar) సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు స్కిప్పర్ నుంచి తప్పుకున్నాడు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా సహకరించిన భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐకి, సెలెక్షన్ కమిటీకి, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ సారథి ధోనీకి, తోటి జట్టు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
ఈ సందర్భంగా ఆశించిన ఫలితాలు రాక పోవడం వల్లనే తాను కెప్టెన్ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తాజా, మాజీ ఆటగాళ్లు కోహ్లీ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ తీసుకున్న నిర్ణయంపై తాను వ్యాఖ్యానించ దల్చు కోలేదన్నాడు. ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏముందని ప్రశ్నించాడు గవాస్కర్(Sunil Gavaskar).
ఇప్పటికే బీసీసీఐ టీ20, వన్డే జట్లకు కెప్టెన్ గా తప్పించింది కోహ్లీని. ఇంకో వైపు సఫారీ టూర్ సందర్భంగా వేచి చూసింది. దీంతో భారత్ జట్టు సీరీస్ కోల్పోయింది. ఈ తరుణంలో ఎందుకు కోహ్లీని కంటిన్యూ చేస్తుందన్నాడు సన్నీ.
ఏది ఏమైనా కోహ్లీ అద్భుత ప్లేయర్ అనడంలో సందేహం లేదు. ఏది ఆడినా వంద శాతం ఎఫర్ట్ పెడతాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు.
భారత జట్టుకు ఎన్ని విజయాలు అందించాడనేది బీసీసీఐ చూడదని నర్మగర్భంగా వ్యాఖ్యానించడం విశేషం.
Also Read : విరాట్ కోహ్లీ నిర్ణయం వ్యక్తిగతం – దాదా