Jayant Patil : ప్రపంచంలో దిగ్గజ వ్యాపారవేత్తగా పేరొందిన ఎలోన్ మస్క్ భారత్ పై గుర్రుగా ఉన్నారు. తమ తయారు చేసే టెస్లా కార్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు మస్క్. కానీ కేంద్ర సర్కార్ ససేమిరా(Jayant Patil) అంటోంది.
దీంతో కేంద్రాన్ని కాదని మొదటి సారిగా తెలంగాణ సర్కార్ స్పందించింది. మీరు వస్తామంటే తాము రెడీగా ఉన్నామని ఆహ్వానం పలికేందుకంటూ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ మేరకు మస్క్ కు ట్వీట్ కూడా చేశాడు. ఇదిలా ఉండగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా టెస్లా సంస్థ చైర్మన్ ఎలోన్ మస్క్ కు సాదర స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేసింది.
అంతే కాకుండా తమకు రెడ్ కార్పెట్ పరుస్తామంటూ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జయంత్ పాటిల్(Jayant Patil) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
భారత దేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు గాను తమ రాష్ట్రం అనువుగా ఉంటుందని స్పష్టం చేశాడు.
ఒక వేళ టెస్లా కార్ల తయారీకి ఎంత స్థలం కావాలన్నా ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే పర్మిషన్ కూడా ఇస్తామని వెల్లడించారు మంత్రి.
ఓ వైపు కేంద్రం మస్క్ ను వద్దనుకుంటుంటే రాష్ట్రాలు మాత్రం రా రమ్మంటూ పిలుస్తుండడం గమనార్హం. కేంద్రంతో పేచీ పడుతున్న ఎలోన్ మస్క్ కు ఇప్పుడు ఆయా రాష్ట్రాలు ఇన్వైట్ చేయడాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read : బిల్ గేట్స్ లైంగిక వేధింపులపై సమీక్ష