Under-19 India : ఓ వైపు సఫారీ టూర్ లో ఉన్న భారత సీనియర్ల జట్టు టెస్టు సీరీస్ కోల్పోయి తీవ్ర నిరాశ పరిస్తే మరో వైపు అండర్ -19 కుర్రాళ్లు దుమ్ము రేపారు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు.
అండర్ -19 వరల్డ్ కప్(Under-19 India) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే టోర్నీ హాట్ ఫెవరేట్ గా భారత్ జట్టు ఉంది. ఈ తరుణంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో అదరగొట్టింది.
ప్రత్యర్థి జట్టును 45 పరుగుల తేడాతో ఓడించి గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక అండర్ -19 జట్టు స్కిప్పర్ యశ్ ధుల్ అద్భుతంగా ఆడాడు. 82 పరుగులు చేసి చుక్కలు చూపించాడు.
ఒక రకంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. స్కోర్ వేగంలో కీలక పాత్ర పోషించాడు. ఇక భారత జట్టు బౌలర్ విక్కీ ఒత్వాల్ సరైన సమయంలో రాణించడంతో జట్టు విజయం సులభమైంది.
మనోడు 10 ఓవర్లు వేసి కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన 5 వికెట్లు పడగొట్టాడు. భారత్ కు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. దీంతో కెప్టెన్ కాదని బౌలింగ్ పరంగా దుమ్ము రేపిన విక్కీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక ఈ వరల్డ్ కప్ విండీస్ వేదికగా జరుగుతోంది. గ్రూప్ -బిలో ఇరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన సఫారీ స్కిప్పర్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది.
టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన సఫారీ టీంకు ఆదిలోనే షాక్ తగిలింది. జాన్ డకౌట్ కాగా వాలంటైన్ 25 పరుగులకే వెనుదిరిగాడు. బ్రెవిస్ ఒక్కడే పర్వాలేదనిపంచాడు. 65 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 187 పరుగులకే ఆలౌటైంది.
Also Read : కోహ్లీ భారత జట్టుకు మూల స్తంభం