Sunil Gavaskar : టీమిండియా మాజీ స్కిప్పర్, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు.
ఈ తరుణంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రెండో టెస్టులో గాయం కారణంగా తప్పుకున్న కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ కు బాధ్యతలు అప్పగించింది.
ఈ తరుణంలో మరోసారి కెప్టెన్సీ ఎంపిక అన్నది ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇదిలా ఉండగా కోహ్లీ సారథ్యంలో టీమిండియా 68 టెస్టులు ఆడితే అందులో 40 విజయాలు సాధించింది.
సక్సెస్ రేటు కూడా బాగానే ఉంది. అయినప్పటికీ వ్యక్తిగతంగా తాను తప్పుకునేందుకే ఇష్టపడుతున్నట్లు ప్రకటించాడు కోహ్లీ. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశాడు సన్నీ.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రికీ పాంటింగ్ తప్పుకున్నప్పుడు రోహిత్ శర్మ కు పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత అతడి సారథ్యంలో ఆ జట్టు పలుసార్లు ఐపీఎల్ గెలుపొందింది.
బాధ్యతలు అప్పగిస్తే మరింత బాధ్యతాయుతంగా ఆడతారంటూ పేర్కొన్నాడు. పనిలో పనిగా కోహ్లీ ప్లేస్ లో రిషబ్ పంత్ ను కెప్టెన్ గా నియమిస్తే బాగుంటుందని సూచించాడు.
చిన్న వయసులో పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ ఆటపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నాడు. అయితే కేఎల్ రాహుల్ పై సీరియస్ అయ్యాడు సన్నీSunil Gavaskar ). రెండో టెస్టు ఓడి పోవడానికి ప్రధాన కారణం కేఎల్ అని ఆరోపించాడు.
అతడి చెత్త నిర్ణయం వల్లనే సఫారీ స్కిప్పర్ పరుగులు చేశాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం గవాస్కర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : కోహ్లీ స్ఫూర్తి దాయకమైన లీడర్