Lakshya Sen : ఛాంపియ‌న్ ను ఓడించిన ల‌క్ష్య‌సేన్

పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుపు

Lakshya Sen : భార‌త ష‌ట్ల‌ర్ ల‌క్ష్య సేన్ సంచ‌ల‌నం సృష్టించాడు. ఏకంగా ప్ర‌పంచ ఛాంపియ‌న్ లోహ్ కీన్ యూను ఓడించి రికార్డు బ్రేక్ చేశాడు. ఇండియా ఓపెన్ -2022 పురుషుల సింగ్స్ టైటిల్ ను గెలుపొందాడు.

ఇవాళ జ‌రిగిన ఫైన‌ల్లో లోహ్ కీన్ యూ పై 24-22 , 21-17 తేడాతో విజ‌యం సాధించాడు. ఈ మ్యాచ్ మొత్తం 54 నిమిషాల పాటు సాగింది. వ‌రుస సెట్ ల‌లో గెలుపొందాడు.

ఈ ఒక్క అద్భుత గెలుపుతో ల‌క్ష్య‌సేన్ (Lakshya Sen)తన కెరీర్ ల సూప‌ర్ 500 టైటిల్ ను చేజిక్కించుకుని చ‌రిత్ర సృష్టించాడు. మొత్తంగా భార‌త క్రీడా చ‌రిత్ర‌లో ఈ టైటిల్ గెలుపొందిన మూడో ఇండియ‌న ప్లేయ‌ర్ గా నిలిచాడు.

అంత‌కు ముందు ఈ ఇండియ‌న్ షట్ల‌ర్ నువ్వా నేనా అన్న రీతిలో సెమీస్ లో మ‌లేషియాకు చెందిన ప్ర‌పంచ 60వ ర్యాంక‌ర్ యోంగ్ ను 19-21, 21-16, 21-12 తేడాతో ఓడించి ఫైన‌ల్ కు వ‌చ్చాడు.

విచిత్రం ఏమిటంటే ఇవాళ ల‌క్ష్య సేన్ పుట్టిన రాజ్. అల్మోరాలో జ‌న్మించాడు. ప్ర‌కాష్ ప‌దుకొనే బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందాడు. ఉత్త‌రాఖండ్ స్టేట్.

ప్ర‌పంచ జూనియ‌ర్ ర్యాంకింగ్ లో నంబ‌ర్ వ‌న్ జూనియ‌ర్ సింగిల్స్ ప్లేయ‌ర్ అయ్యాడు. 2016లో ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ సీరీస్ టోర్న‌మెంట్ లో పురుష‌ల సింగిల్స్ టైటిల్ ను గెలుపొందాడు.

2018లో ఆసియా జూనియ‌ర్ ఛాంపియ‌న్ షిప్ లో టాప్ సీడెడ్ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 1 గా ఉన్న కున్లా వుట్ విటిడ్ స‌ర్న్ ను ఓడించి ఛాంపియ‌న్ గా నిలిచాడు.

జ‌పాన్ కు చెందిన యుసుకే ఒనోడెరాను ఓడించి డ‌చ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు.

Also Read : ద్ర‌విడ్ తో చ‌ర్చించాకే కోహ్లీ రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!