Yuvraj Singh : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పు కోవడంతో ఆ ప్లేస్ లో యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ కు ఇస్తే బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇదే విషయాన్ని ఇప్పటికే భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కూడా పేర్కొన్నాడు. భవిష్యత్తులో టీమిండియా మరింత రాణించాలంటే యువకులకే సారథ్య బాధ్యతలు అప్పగించాలని సూచించాడు యువరాజ్ సింగ్(Yuvraj Singh).
ప్రస్తుతం కోహ్లీ తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే తాజా, మాజీ ఆటగాళ్లు ఎవరికి తోచిన విధంగా వారు పేర్లు సూచిస్తున్నా ప్రధానంగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లలో ఎవరో ఒకరికి భారత సెలెక్షన్ కమిటీ ఇవ్వబోతోందని క్రికెట్ వర్గాల సమాచారం.
పదే పదే గాయాల బారిన పడటం రోహిత్ శర్మకు తలనొప్పిగా మారింది. ఇంకో వైపు కేఎల్ రాహుల్ అనుభవ రాహిత్యం కొంత ఇబ్బందికరంగా ఉండడంతో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా వ్యవహరించిన రిషబ్ పంత్ కు టెస్టు కెప్టెన్సీ అప్పగిస్తేనే బెటర్ అన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తుండడం విశేషం.
అన్ని ఫార్మాట్ లలో చక్కగా రాణిస్తున్న పంత్ కు కెప్టెన్ గా చేస్తే అతడి కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. మొత్తంగా కోహ్లీ తప్పుకోవడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో యువీ కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : నేర్చుకోవాల్సింది చాలా ఉంది