Rohit Vemula : తరాలు మారినా, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, సాంకేతిక పరిజ్ఞానం కొంత పుంతలు తొక్కినా భారత దేశంలో కులం తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
మతం తన రంగు పులుముకుంటూ కాటేస్తోంది. మార్పును కోరుకోని వాళ్లు ఎల్లప్పటికీ దాడి చేసేందుకు సంసిద్దులై ఉంటారు.
ఇక్కడ ప్రశ్నించడం నేరంగా పరిగణించ బడుతూ వస్తోంది.
మేధావులను తయారు చేసి, దేశానికి భావి భారత పౌరులను అందించే విశ్వ విద్యాలయాలు
ఇప్పుడు పాలకులకు సపోర్ట్ గా తయారవుతున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.
ఇక రోహిత్ వేముల సూసైడ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానికి వెనుక ఆయన రాసినట్లుగా పేర్కొన్న నోట్ కలకలం రేపింది.
రోహిత్(Rohit Vemula )మరణించి ఆరేళ్లవుతోంది.
కానీ తాను దేని కోసమైతే ప్రశ్నించాడో దేనిని కావాలని అనుకున్నాడో అది మాత్రం నేరవేరలేదు.
యూనివర్శిటీలు ఇప్పుడు భట్టీ పట్టే పనిలో పడ్డాయి. ర్యాంకుల ఆధారంగా విద్యార్థులను కొలిచే సంప్రదాయం మొదలైంది.
దాని వెనుక ఉన్నది అతి పెద్ద వ్యాపారం. లిక్కర్ బిజినెస్ కంటే ఎక్కువగా విద్యా వ్యాపారంగా మారిందనేది వాస్తవం.
నైతిక విలువల్ని పక్కన పెట్టేశాం. డాబు దర్పానికి ప్రయారిటీ ఇస్తూ వెళుతున్నాం.
ఇదేనా కోరుకున్న విద్యా వ్యవస్థ. ప్రశ్నించడం నేర్వని ఏది విద్యా కానేరదు. ప్రశ్నలోనే జవాబు దాగి ఉంటుందన్నది నిజం. రోహిత్ (Rohit Vemula )పేర్కొన్నట్లు ఇది పుట్టుకతో వచ్చిన ప్రమాదంపై ఆధారపడినందున కులం ఈ నమూనా వ్యతిరేక సిద్దాంతం.
దేశం పురోగమించాలంటే ప్రజలంతా ఏకతాటిపైకి రావాలి. మనమంతా నక్షత్ర ధూళితో తయారు చేయబడ్డ వాళ్లం.
స్వతంత్ర భారత దేశం కూడా అంటరానితనం సంకెళ్ల నుండి విముక్తి పొందిన క్షణానికి ముగింపు పలకాలని అనుకున్నారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.
గత ఏడు దశాబ్దాల నుంచీ ఇది కొనసాగుతూనే ఉన్నది. ఈ అణిచివేత కొత్త రూపాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. కుల, మత దురభిమానాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.
అతడి మరణం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. దానికి సమాధానం ఉన్నదా అన్నది తేల్చాల్సిన అవసరం ఉంది.
Also Read : సినీ జగత్తులో విరిసిన కలం