Rashid Latif : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన కామెంట్స్ చేశాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భారత టెస్టు సారథ్య బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకోవడంపై స్పందించాడు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ ఏం మాట్లాడినా బీసీసీఐ చీఫ్ ఏ ట్వీట్ చేసిన ఇది ఇద్దరి దిగ్గజాల మధ్య యుద్ధంగానే చూడక తప్పదన్నాడు.
వీరిద్దరి మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు రషీద్ లతీఫ్(Rashid Latif). ఇదిలా ఉండగా కోహ్లీ తప్పుకోవడాన్ని తాజా, మాజీ ఆటగాళ్లు జీర్ణించు కోవడం లేదు.
మరో వైపు టెస్టుల పరంగా చూస్తే విరాట్ సక్సెస్ రేట్ అధికంగా ఉంది. తన సారథ్యంలో భారత జట్టు 68 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 40 మ్యాచ్ లు గెలిపించాడు కోహ్లీ. 17 మ్యాచ్ ల్లో ఓడి పోయాడు.
ఈ తరుణంలో 58 శాతానికి పైగా సక్సెస్ రేటు ఉండడం గమనార్హం. రవిశాస్త్రి, కోహ్లీ కాంబినేషన్ లో భారత్ అద్భుత విజయాలు నమోదు చేసింది. ఇదే సమయంలో కోహ్లీ ఒంటెత్తు పోకడ కూడా అతడు తప్పుకునేందుకు కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి.
దీంతో దాదా బీసీసీఐ చీఫ్ గా కొలువుతీరాక వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయడం విశేషం. ఊహాగానాలకు తెర దించుతూ గంగూలీ మొదటగా స్పందించాడు. కోహ్లీ రిజైన్ చేయడం అన్నది తన వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నాడు.
కోహ్లీ తన రాజీనామా లేఖలో మాత్రం ఎక్కడా ఎవరిపై ఒక్క మాట కూడా పేర్కొనక పోవడం విశేషం. మొత్తం మీద ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు చివరకు తప్పుకునేలా చేసిందంటూ ఆరోపించాడు రషీద్ లతీఫ్.
Also Read : టెస్టు కెప్టెన్సీకి పంత్ బెటర్