Dhanush Aishwarya : ప్రముఖ తమిళ సినీ నటుడు ధనుష్ , ఐశ్వర్య జంట విడిపోయారు. ఈ మేరకు తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. సామాజిక మాధ్యమం ద్వారా వారు తాము విడిపోతున్న విషయాన్ని ప్రకటించారు.
అధికారికంగా ధ్రువీకరించారు. ఈ జంట విడిపోతున్నట్లు వెల్లడించడంపై ఒక్కసారిగా తమిళ సినీ లోకం విస్మయానికి గురైంది. అత్యంత నిబద్దత కలిగిన నటుడిగా ధనుష్ కు పేరుంది.
వీరిద్దరి మధ్య సాన్నిహిత్యానికి తెర పడింది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దానిని ఎదుర్కొనేందుకు అవసరమైన గోప్యతను తమకు ఇవ్వండి అంటూ కోరారు ధనుష్, ఐశ్వర్య(Dhanush Aishwarya). 18 ఏళ్లుగా మేం కలిసి ఉన్నాం.
ఎన్నో అడుగులు వేశాం. ఇప్పుడు విడి పోవాలని నిర్ణయించుకున్నామని తెలిపార. నటుడిగా, చిత్ర నిర్మాతగా ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకున్నారు ధనుష్. ఆయన ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి చేసిన ప్రకటనలో ఇలా ఉంది. పద్దెనిమిది సంవత్సరాల పాటు స్నేహితులుగా కలిసి ఉన్నాం. దంపతులుగా , తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరికొకరం కలిసి మెలిసి ఉన్నాం.
ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో అర్థవంతంగా, అవగాహనతో, సర్దుబాట్లతో, అనుకూలతతో సాగిందని పేర్కొన్నారు ధనుష్, ఐశ్వర్య(Dhanush Aishwarya).
మా మార్గాలు వేరుగా ఉన్న ప్రస్తుత తరుణంలో కలిసి ఉండలేమన్న నిర్ణయానికి వచ్చామని అందుకే విడి పోవడమే మేలని అనుకున్నామని స్పష్టం చేశారు.
మమ్మల్ని దయతో మీరంతా అర్థం చేసుకుంటారని ఇలాగే ఎప్పటిలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐశ్వర్య ఎవరో కాదు దిగ్గజ నటుడు తలైవా రజనీకాంత్ కూతురు కావడం విశేషం.
Also Read : ఖద్దరును ధరిద్దాం కాపాడుకుందాం