Harbhajan Singh : భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత టెస్టు క్రికెట్ లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తున్న చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేల భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.
వారిద్దరూ గత కొంత కాలంగా ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నారు. సౌతాఫ్రికా టూర్ లో రహానే 6 ఇన్నింగ్స్ లు ఆడి 136 పరుగులు చేస్తే చతేశ్వర్ పుజారా 124 పరుగులు చేశాడు.
భారత జట్టు 2-1 తేడాతో టెస్టు సీరీస్ కోల్పోయింది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు పుజారా, రహానేలను వెంటనే తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
వారి స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ తరుణంలో భజ్జీ (Harbhajan Singh )ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఊహించని రీతిలో పోటీ నెలకొందని పేర్కొన్నాడు. ఒక వేళ వీరిద్దరూ ఆడక పోయి టీమిండియా గనుక విజయం సాధించి ఉండి ఉంటే అంతగా పట్టించుకునే వారు కాదేమోనని అభిప్రాయపడ్డాడు.
కానీ భారత్ కేవలం బ్యాటింగ్ లో ఎలాంటి ప్రగతి కనిపించక పోవడం వల్లే చేజేతులారా ఓటమి పాలైందని పేర్కొన్నాడు భజ్జీ(Harbhajan Singh ). దీంతో రహానే, పుజారా మళ్లీ టెస్టులో వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని కుండ బద్దలు కొట్టాడు.
వారి ప్లేస్ ను భర్తీ చేసేందుకు భారత జట్టులో వచ్చేందుకు సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ లు వేచి చూస్తున్నారని గుర్తు చేశాడు. గతంలో జట్టు సభ్యుల కోసం సెలెక్షన్ కమిటీ వేచి చూసేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నాడు.
Also Read : రషీద్ లతీఫ్ సంచలన కామెంట్స్