Bhagwant Mann : ‘మాన్’ మామూలోడు కాద‌ప్పా

అద్బుత‌మైన న‌టుడు నాయ‌కుడు

Bhagwant Mann : ఎవ‌రీ భ‌గ‌వంత్ మాన్ అనుకుంటున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌పున పంజాబ్ లో త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో గెలిస్తే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌నున్నారు.

ఇదే విషయాన్ని ఆ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ డిక్లేర్ చేశాడు.

ఈ మేర‌కు పంజాబ్ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఓటింగ్ కూడా చేప‌ట్టారు. భారీ ఎత్తున జ‌నం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann) కు ఓటు వేశారు.

దీంతో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారాడు భ‌గ‌వంత్ మాన్. మంచి న‌టుడిగా పేరొందాడు.

2011లో మ‌న్ ప్రీత్ సింగ్ బాద‌ల్ నేతృత్వంలోని పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ లో చేర‌డంతో త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించాడు.

ఆప్ త‌ర‌పు నుంచి ప్ర‌స్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు భ‌గ‌వంత్ మాన్.

అయితే పార్ల‌మెంట్ లో త‌న వాగ్ధాటితో మంచి పేరు సంపాదించాడు. అటు ప్ర‌జ‌ల నుంచి ఇటు నాయ‌కుల నుంచి కూడా ఆయ‌న మ‌ద్ద‌తు పొందారు.

ఏకంగా పంజాబ్ సీఎం అభ్య‌ర్థి కోసం ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ కోరారు. అంతా మాన్ కే ఓటు వేశారు. 2012లో లెహ్రా నుంచి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడి పోయాడు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann). 2014లో ఆప్ లో చేరాడు.

సంగ్రూర్ స్థానం నుంచి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యాడు. 2017లో రాష్ట్ర ఎన్నిక‌ల్లో అకాలీద‌ళ్ కు చెందిన సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్ చేతిలో ప‌రాజయం పొందాడు. 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాడు.

గ‌తంలో మ‌ద్యానికి బానిసైన కార‌ణంగా ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌ను టార్గెట్ చేశారు. దీంతో అదే ఏడాది జ‌రిగిన పార్టీ మీటింగ్ లో ఇక తాగ‌నంటూ ప్ర‌మాణం చేశాడు. త‌న ప‌క్క‌నే ఉన్న త‌ల్లికి తాను ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తాన‌ని మాటిచ్చాడు.

93 శాతానికి పైగా ఓట‌ర్లు మాన్ వైపు ఉండ‌డం విశేషం. 1973 అక్టోబ‌ర్ 17న పుట్టారు. కామెడీకి పెట్టింది పేరు మాన్. ఆయ‌న‌ను అంతా జ‌గ్ను అని పిలుస్తారు.

Also Read : సినీ జ‌గ‌త్తులో విరిసిన క‌లం

Leave A Reply

Your Email Id will not be published!