Ricky Ponting : ఆసిస్ కు జ‌స్టిన్ లాంగ‌ర్ అవ‌స‌రం

స్ప‌ష్టం చేసిన మాజీ క్రికెట‌ర్ పాంటింగ్

Ricky Ponting : ఆస్ట్రేలియాను గాడిలో పెట్ట‌డంలో అరుదైన విజ‌యాలు ద‌క్కేలా చూడ‌డంలో హెడ్ కోచ్ జ‌స్టిస్ లాంగ‌ర్ చేసిన కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నాడు ఆసిస్ మాజీ క్రికెట‌ర్ రికీ పాంటింగ్(Ricky Ponting).

క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు లాంగ‌ర్ ను కాంట్రాక్ కాలాన్ని పొడిగించ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్నాడు.  ఎందుకంటే జ‌ట్టు ఇప్పుడు అన్ని రంగాల్లో స‌మ తూక‌తంతో ఉంద‌న్నాడు.

ఆ దిశ‌గా ఫ‌లితాలు కూడా అలాగే వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నాడు. లాంగ‌ర్ తాను చేయ‌గ‌లిగినదంతా చేశాడ‌ని తెలిపాడు. లాంగ‌ర్ ప‌ద‌వీ కాలంలో ఆస్ట్రేలియా పురుషుల టీ20 ప్ర‌పంచ క‌ప్ ను సాధించింది.

మ‌రో వైపు స్వ‌దేశంలో ఇంగ్లండ ను నాలుగు మ్యాచ్ లు గెలుపొంది ఒక‌టి డ్రా చేసుకుని యాషెస్ సీరీస్ గెలుపొందింద‌న్నాడు రికీ పాంటింగ్(Ricky Ponting). అంత‌కు ముందు కోచ్ గా ఎవ‌రిని నియ‌మించాల‌నే దానిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది.

కానీ లాంగ‌ర్ వ‌చ్చాక జ‌ట్టు ఆట స్వ‌రూపానే మార్చేశాడంటూ అభిప్రాయం వ్య‌క్తం చేశాడు రికీ పాంటింగ్. ప్ర‌ధానంగా ఆట‌గాళ్ల ప‌నితీరును మెరుగు ప‌ర్చేందుకు కృషి చేశాడ‌ని, మొత్తంగా గాడి త‌ప్పిన ఆసిస్ టీమ్ ను శ‌క్తివంతంగా త‌యారు చేశాడ‌ని కితాబు ఇచ్చాడు.

ఈ స‌మ‌యంలో జ‌స్టిస్ లాంగ‌ర్ ను కొన‌సాగిస్తేనే మ‌రింత ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు నుంచి కాంట్రాక్టు పున‌రుద్ద‌ర‌ణ విష‌యంపై క్లారిటీ రాక పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టాడు రికీ పాంటింగ్.

ప్ర‌స్తుతం జ‌ట్టు స‌మ‌తూకంతో ఉంద‌న్నాడు. ఇలా త‌యారు కావ‌డానికి లాంగ‌రే కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు.

Also Read : విండీస్ కు ఇది చీక‌టి రోజు

Leave A Reply

Your Email Id will not be published!