Dilip Vengsarkar : భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పడంతో తాజా, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. గౌతం గంభీర్ అయితే కంగా నాయకత్వం అన్నది వారసత్వం కాదన్నాడు.
ఇక టీమిండియాకు మొదటి వరల్డ్ కప్ తీసుకు వచ్చిన కపిల్ దేవ్ నిఖంజ్ అయితే కోహ్లీపై విరుచుకు పడ్డాడు. ముందు ఇగోను పక్కన పెట్టి ఆటపై ఫోకస్ పెట్టాలని సూచించాడు.
పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ అయితే బీసీసీఐ చీఫ్, సెలెక్షన్ కమిటీకి విరాట్ కోహ్లీకి మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల కారణంగానే తన పదవికి రాజీనామా చేశాడంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
ఇదే సమయంలో మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షహీద్ అఫ్రిది అయితే రిజైన్ చేసి మంచి పని చేశాడన్నాడు. ఇక నుంచి ఆటపై దృష్టి పెట్టాలని సూచించాడు.
ఇక భారత క్రికెట్ జట్టు మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ దిలీప్ వెంగ్ సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ రాజీనామాతో ఏర్పడిన స్థానాన్ని రోహిత్ శర్మకు లేదా రవిచంద్రన్ అశ్విన్ కు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.
మరో వైపు ప్రస్తుత సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ముందు బిగ్ టాస్క్ నెలకొంది. ఆయన ఎవరిని ఎంపిక చేస్తాడనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
అంతే కాకుండా ఒకరికి ఒక ఏడాది మరొకరికి ఇంకో ఏడాది పూర్తి కాలం కాకుండా నాయకత్వం అప్పగిస్తే బెటర్ అన్నాడు వెంగ్ సర్కార్(Dilip Vengsarkar).
Also Read : వసీం జాఫర్ వన్డే టీం ఇదే