KL Rahul : అందరి కళ్లు ప్రస్తుతం తాత్కాలిక స్కిప్పర్ కేఎల్ రాహుల్ పై కేంద్రీకృతమై ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే భారత్ మూడు టెస్టుల సీరీస్ ను 2-1 తేడాతో ఓడి పోయింది.
ఇక ఉన్నది ఒక్కటే అది మూడు వన్డేల సీరీస్. పోయిన పరువును కాపాడు కోవాలంటే భారత జట్టు చెమటోడ్చక తప్పదు. ఓ వైపు నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంకో వైపు అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్ కు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఈ దేశంలో క్రికెట్ అంటే ఓ మతం. అదే జీవితం.
దాని చట్టూ తమ ఆశల్ని పోగేసుకుని చూసేవాళ్లు కోటానుకోట్ల మంది ఉంటారు. అంతెందుకు మొన్నటికి మొన్న యూఏఈ వేదికగా జరిగిన టీ20 మెగా లీగ్ లో భారత్ ఓటమిని జీర్ణించు కోలేక నానా ఇబ్బంది పడ్డారు.
దేనినైనా భరిస్తారు అభిమానులు కానీ టీమిండియా ఓడిపోతే మాత్రం తట్టుకోలేరు. భారత క్రికెట్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ను ఏకపక్షంగా శాసిస్తోంది. ఏ మాత్రం తలకిందులైనా కోట్లాది రూపాయలు కోల్పోవడం ఖాయం.
అందుకే క్రీడాభిమానులే కాదు ఆయా కంపెనీలు సైతం బాగా ఆడాలని, గెలుపు సాధించాలని కోరుతాయి. అనూహ్యంగా రోహిత్ శర్మ తప్పుకోవడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ చేపట్టే చాన్స్ దొరికింది.
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ కూడా మనోడి వైపు మొగ్గు చూపినా అది కొంత కాలం వరకేనని గుర్తుంచు కోక తప్పదు. ఎందుకంటే ఏడేళ్ల పాటు ఎన్నో విజయాలు సాధించి పెట్టిన కోహ్లీనే పక్కన పెట్టింది బీసీసీఐ.
ఇక కేఎల్(KL Rahul) ఎంత. తను ఆడాలి. మిగతా వాళ్లను ఆడేలా చేయాలి. ఆపై జట్టు విజయం సాధించేలా చూడాలి. మరి రాహుల్ రాణిస్తాడా లేక చేతులెత్తేస్తాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : కోహ్లీ రాణిస్తాడా రఫ్పాడిస్తాడా