Babar Azam : భారత జట్టు ఆటగాళ్లకు కోలుకోలేని షాక్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించింది. ఈ ఓవర్ ఆల్ టీమ్ కు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్, స్కిప్పర్ బాబర్ ఆజమ్(Babar Azam )ను నాయకుడిగా ప్రకటించింది.
విచిత్రం ఏమిటంటే మన జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరికి కూడా ఇందులో చోటు దక్కలేదు. ఇవాళ ఐసీసీ తన టీమ్ ను డిక్లేర్ చేసింది. 2021లో టాప్ లో ఉన్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేపట్టాడు ఆజమ్.
టోర్నీలో అత్యధిక పరుగుల స్కోరర్ గా నిలిచాడు. మొత్తం మీద బాబర్ 29 మ్యాచ్ లు ఆడాడు. ఓ సెంచరీ తో పాటు 9 హాఫ్ సెంచరీలతో 37. 56 సగటుతో 939 పరుగులు చేశాడు బాబర్ ఆజమ్(Babar Azam ).
యూఏఈ, ఒమన్ లలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో తన జట్టును సెమీస్ కు చేర్చినప్పుడు అతడి నాయకత్వంపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఇక ఐసీసీ ప్రకటించిన వరల్డ్ టీ20 టీమ్ లో ఆస్ట్రేలియాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను చేర్చింది.
వారిలో మిచెల్ మార్ట్ , జోష్ హేజిల్ వుడ్ ఉన్నారు. ఈ టీంలో ముగ్గురు పాకిస్తాన్ ప్లేయర్లకు చోటు దక్కింది. బారిలో బాబర్ ఆజమ్ తో పాటు మహ్మద్ రిజ్వాన్ , షాహీన్ షా అఫ్రిది ఉన్నారు.
29 మ్యాచ్ లలో 1326 పరుగులతో రిజ్వాన్ 73.66 సగటు రేటు సాధించాడు. ఇక అఫ్రిదీ 21 మ్యాచ్ లలో 26.04 సగటుతో 23 వికెట్లు తీశాడు. ఇక ఐసీసీ ప్రకటించిన టీ20 వరల్డ్ టీమ్ ఇదే.
జోస్ బట్లర్, రిజ్వాన్ , బాబర్ ఆజమ్ , ఐడెన్ మార్క్రామ్ , మిచెల్ మార్ష్ , డేవిడ్ మిల్లర్ , తబ్రైజ్ షమ్సీ, జోష్ వుడ్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, షాహీన్ షా అఫ్రిది ఉన్నారు.
Also Read : రాహులో రాహులా గెలిపిస్తావా