ICC Test Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ టెస్టు ర్యాంకింగ్స్ డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ , జస్ ప్రీత్ బుమ్రా తమ ర్యాంకులను మెరుగు పర్చుకున్నారు. బ్యాటర్ పరంగా కోహ్లీ ఏడో స్థానంతో సరి పెట్టుకున్నాడు.
బుమ్రా బౌలింగ్ పరంగా టాప్ 10 లోకి చేరాడు. ఐదు రోజుల ఫార్మాట్ లో తన 79వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 29 పరుగులు చేశాడు. రెండో స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు.
ఇక సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కేపర్ రిషబ్ పంత్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పది స్థానాలు దాటి 14వ ర్యాంక్(ICC Test Rankings) కు చేరుకున్నాడు.
కాగా కేప్ టౌన్ లో ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టడం ద్వారా బౌలింగ్ చార్ట్ లో టాప్ 10లోకి (ICC Test Rankings)దూసుకు వెళ్లాడు. మూడు టెస్టుల సీరీస్ లో భారత్ 2-1 తో సీరీస్ కోల్పోయింది.
ఈ తరుణంలో తాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు కోహ్లీ. కీగన్ పీటర్స్ 82 పరుగులు చేయడం ద్వారా 33వ ర్యాంకుకు చేరుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. టెంబా బావుమా 28వ ర్యాంకు సాధించాడు. డుసేన్ 43వ ర్యాంకులో ఉండగా రబాడా మూడో స్థానంలో లుంగి ఎంగిడి 21వ ర్యాంకుతో సరి పెట్టుకున్నారు.
యాషెస్ సీరీస్ లో ట్రావిస్ హెడ్ బ్యాటర్లలో కెరీర్ లో ఐదో స్థానంలో నిలిచాడు. గత నెలలో అతడి ప్లేస్ 10వ ర్యాంకులో ఉండేది. కామెరాన్ గ్రీన్ రెండో స్థానంలో ఉన్నాడు.
Also Read : తప్పుకున్నా తగ్గని బ్రాండ్ వాల్యూ