Dale Steyn : భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పు కోవడంపై ఇంకా తాజా, మాజీ ఆటగాళ్లు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ బీసీసీఐతో పడలేకే కోహ్లీ తప్పుకున్నాడని పేర్కొన్నాడు. ఇక షాహిద్ అఫ్రిది అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని కితాబు ఇచ్చాడు.
ఈ తరుణంలో డేల్ స్టెయిన్ మాత్రం వారికి భిన్నంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఎక్కువ కాలం బయో బబుల్ లో ఉండడం తో కుటుంబానికి దూరంగా ఉండలేక పోయాడని పేర్కొన్నాడు.
అందుకే తాను కెప్టెన్సీ నుంచి వైదొలిగి ఉంటాడని తెలిపాడు. కోహ్లీకి ఫ్యామిలీ అంటే ఎనలేని అభిమానమని , సారథ్య బాధ్యతల వల్ల తీవ్ర ఒత్తిడికి లోనై ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇక నుంచి ఎలాంటి ఒత్తిళ్లంటూ ఉండవని, తన ఆటపై ఎక్కువగా ఫోకస్ పెడతాడని చెప్పాడు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడిగా అభివర్ణించాడు డేల్ స్టెయిన్(Dale Steyn ).
ప్రస్తుతం ఆయన ఫ్యామిలీలోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. తన కూతురును విడిచి పెట్టి ఉండలేక పోతున్నాడని అన్నాడు. ఏ ఆటగాడి కైనా ఆటతో పాటు ఫ్యామిలీ కూడా ముఖ్యమన్నాడు.
ఎంత సంపాదించినా నా అన్న వాళ్లు లేక పోతే కష్టమన్నాడు డేల్ స్టెయిన్. ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఫ్యామిలీతో పాటు ఆటపై వ్యక్తిగతంగా ఎక్కువగా ఫోకస్ పెట్టే చాన్స్ ఉందన్నాడు.
Also Read : రాహులో రాహులా గెలిపిస్తావా