ICC Test Rankings : వరుస పరాజయాలతో కంటిన్యూ అవుతున్న భారత జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇవాళ తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ (ICC Test Rankings )విడుదల చేసింది.
ఇక స్వదేశంలో ఇంగ్లండ్ ను 4-0 తేడాతో చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా టాప్ లో నిలిచింది. ఏకంగా ఆ జట్టు 119 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక 117 పాయింట్లు సాధించి రెండో స్థానంతో సరి పెట్టుకుంది.
ఈ రెండు జట్లు యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో తలపడ్డాయి. ఆసిస్ కప్ ఎగరేసుకు పోయింది. ఇక టెస్టు మ్యాచ్ లలో సైతం తమ సత్తా చాటుతున్నారు కంగారూలు.
మరో వైపు సౌతాఫ్రికాతో 2-1 తేడాతో ఓటమి మూట గట్టుకుని చివరకు సీరీస్ కూడా కోల్పోయిన భారత జట్టు మూడో స్థానానికి దిగజారింది. టీమిండియా 116 పాయింట్లు సాధించింది.
ఇక పాయింట్ల పట్టికలో అనూహ్యంగా ఆసిస్ తో ఓటమి మూటగట్టుకుని నాలుగో స్థానానికి పడి పోయింది. భారత్ పై టెస్టు సీరీస్ గెలుపొందిన ప్రోటీస్ ఐదో స్థానానికి (ICC Test Rankings )ఎగ బాకింది.
పాకిస్తాన్ ఆరో స్థానంతో సరి పెట్టుకుంది. మిగతా జట్లు సైతం ఆ దరిదాపుల్లోకి రాక పోవడం విశేషం. ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించడం ఆసిస్ కు సానుకూలంగా మారింది.
భారత్ మొదట్లో మెరిసినా ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ చేతులెత్తేసింది. ఏకంగా సఫారీ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. మరో వన్డే లో సైతం చాప చుట్టేసింది.
Also Read : ఐర్లాండ్ పై ఇండియా అదుర్స్