Sunil Gavaskar : కేఎల్ రాహుల్ పై మరోసారి నిప్పులు చెరిగారు భారత మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar ). అత్యంత చెత్త కెప్టెన్సీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటికే సఫారీ టూర్ లో ఉన్న భారత జట్టు మూడు టెస్టుల సీరీస్ ను పోగొట్టుకుంది. ఇక మూడు వన్డేల సీరీస్ లో భాగంగా మొదటి వన్డేలో 31 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.
ఫస్ట్ వన్డే మ్యాచ్ పూర్తయిన తర్వాత సన్నీ స్పందించాడు. కేఎల్ రాహుల్ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడని వ్యాఖ్యానించారు. విచిత్రంగా వెంకటేశ్ అయ్యర్ ను ఎందుకు వాడుకోలేదని నిలదీశాడు గవాస్కర్.
ఇదిలా ఉండగా గాయం కారణంగా తప్పుకున్నాడు రోహిత్ శర్మ. దీంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ.
సౌతాఫ్రికా స్కిప్పర్ టెంబా బావుమా, డస్సేన్ ల మధ్య ఏకంగా 204 పరుగుల భాగస్వామ్యం కలిగి ఉండడాన్ని తప్పు పట్టారు.
ఒక దశలో భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 138 పరుగులతో ఉన్న సమయంలో ఏకంగా ఆరు వికెట్లు తక్కువ పరుగుల వ్యవధిలో కోల్పోవడాన్ని ప్రశ్నించాడు.
వారిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఎలాంటి ఆలోచనలు కేఎల్ రాహుల్ చేయలేదని ధ్వజమెత్తారు సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar ).
ఇదిలా ఉండగా ప్రస్తుతం భారత జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ, సిరాజ్ గాయపడడం కూడా ఒకింత ఇబ్బందిగా మారింది.
శిఖర్ ధావన్ సఫారీ బౌలర్లను ఈజీగా ఎదుర్కొంటే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడలేక పోవడం గమనార్హం.
Also Read : డేల్ స్టెయిన్ కీలక కామెంట్స్