Ajit Doval : ఇండియ‌న్ జేమ్స్ బాండ్ ‘ధోవ‌ల్’

జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు

Ajit Doval : భార‌తీయ భ‌ద్ర‌త గురించి మాట్లాడాలంటే ముందు గుర్తుకు వ‌చ్చే పేరు అజిత్ ధోవ‌ల్(Ajit Doval). మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరాక ఆయ‌న జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా ఎంపిక‌య్యారు.

ఆ త‌ర్వాత దేశంలో నిఘా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.

అపార‌మైన అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా అజిత్ ధోవ‌ల్ పేరు తెచ్చుకున్నారు.

ఒక్క‌సారి ఆయ‌న చూపు సారించారంటే అక్క‌డ విజ‌యం ద‌క్కాల్సిందే.

మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ జెంటిల్మెన్ గా కూడా పేరుంది. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు. ఆయ‌న పూర్తి పేరు అజిత్ కుమార్ ధోవ‌ల్.

1945 జ‌న‌వ‌రి 20న జ‌న్మించారు. ఉత్త‌రాఖండ్ లోని ఘిరి బ‌నేస్యున్ స్వ‌స్థ‌లం.

నిఘా, శాంతి భ‌ద్ర‌త‌ల అధికారిగా ప‌ని చేశారు. 2014 మే 30 నుంచి జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా ఉన్నారు.

ప్ర‌ధాని మోదీకి సేవ‌లు అందిస్తున్నారు. 2004-05 మ‌ధ్య నిఘా బ్యూరోకు డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు అజిత్ ధోవ‌ల్(Ajit Doval).

దాదాపు 10 ఏళ్ల పాటు ఆ సంస్థ కార్య‌క‌లాపాల విభాగానికి చీఫ్ గా ఉన్నారు.

త‌న‌దైన ముద్ర వేశారు. ఆయ‌న తండ్రి సైన్యంలో ప‌ని చేశారు.

1968 కేర‌ళ క్యాడ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్. 23 ఏళ్ల‌కే ఐపీఎస్ కు ఎంపిక‌య్యారు. ఆజ్మీర్ లోని మిల‌ట‌రీ స్కూల్ లో చ‌దివారు.

ఆగ్రా యూనివ‌ర్శిటీలో పీజీ చేశారు. పంజాబ్, మిజోరంల‌లో తిరుగుబాటు నిరోధ‌క చ‌ర్య‌ల్లో పాలు పంచుకున్నారు.

1999 కాంద‌హార్ లో చిక్కుకున్న విమాన ప్ర‌యాణీకుల విడుద‌ల కోసం సంప్ర‌దింపులు జ‌రిపిన ముగ్గురిలో ధోవ‌ల్ ఒక‌రు.

ఎంఎసీ, జేటీఎఫైల‌కు సంస్థాప‌క చైర్మ‌న్ గా ప‌ని చేశారు. దేశ వ్య‌తిరేక శ‌క్తుల‌ను అణిచి వేసే చ‌ర్య‌ల్లో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

త‌న స‌ర్వీసుల్లో ఎక్కువ కాలం అజ్ఞాతంలో గ‌డిపారు.

ధోవ‌ల్ ఉన్నంత వ‌ర‌కు భార‌త దేశాన్ని ఏమీ చేయ‌లేమ‌ని ఇత‌ర దేశాలు పేర్కొన్నాయంటే ఆయ‌న‌కు ఉన్న ప‌వ‌ర్ అలాంటిది.

మిజో నేష‌న‌ల్ ఆర్మీ ప‌త‌నాన్ని శాసించాడు.

20 ఏళ్ల పాటు స‌మ‌స్య‌గా ఉన్న ఎంఎన్ఏ కు ముగింపు ప‌లికాడు.

అప్ప‌టి ప్ర‌ధాని ధోవ‌ల్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆప‌రేష‌న్ బ్లాక్ థండ‌ర్ ను అమ‌లు చేయ‌డం వెనుక ధోవ‌ల్ ఉన్నారు.

పాకిస్తాన్ లో ఏడేళ్ల పాటు ఉన్నాడు. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధాని అయ్యాక ధోవ‌ల్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్ట‌ర్ గా నియమించారు.

2005లో అధికారికంగా రిటైర్ అయ్యారు.

ఎన్నో కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్స్ కు వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేశారు. దావూద్ ను మ‌ట్టు పెట్టేందుకు స్కెచ్ వేశాడు.

ధోవ‌ల్ దెబ్బ‌కు పారి పోయాడు మాఫియా డాన్. 2015లో శ్రీ‌లంక‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌ను ఒకే తాటిపైకి తీసుకు వ‌చ్చాడ‌ని పేరుంది.

అప్ప‌టి చీఫ్ రాజ‌ప‌క్స చైనాకు స‌పోర్ట్ గా ఉండ‌డంతో వ్యూహ ర‌చ‌న చేశాడ‌ని టాక్. ప‌శ్చిమాసియా,

ఆగ్నేసియా దేశాల్లో నిఘా వ‌ర్గాలు చురుకుగా ప‌ని చేసేలా ధోవ‌ల్ మార్పులు తెచ్చార‌ని అందుకే చోటా రాజ‌న్ ను ప‌ట్టు కున్నార‌ని స‌మాచారం.

భార‌త ద‌ళాలు నియంత్ర‌ణ రేఖ‌ను దాటి పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లోని ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై దాడులు కూడా ధోవ‌ల్ ప‌నే.

Also Read : ‘మాన్’ మామూలోడు కాద‌ప్పా

Leave A Reply

Your Email Id will not be published!