Allan Donald : విరాట్ కోహ్లీ మామూలోడు కాదు

మాజీ క్రికెట‌ర్ అల‌న్ డొనాల్డ్

Allan Donald  : భార‌త్ స్టార్ ప్లేయ‌ర్ , టీమిండియా మాజీ స్కిప్ప‌ర్ విరాట్ కోహ్లీ త‌న సార‌థ్య బాధ్య‌తల నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత తాజా, మాజీ ఆట‌గాళ్లు తోచిన రీతిలో స్పందిస్తున్నారు.

పాకిస్తాన్ మాజీ ఆట‌గాళ్లు ర‌షీద్ ల‌తీఫ్‌, షాహిదీ అఫ్రిదీ బీసీసీఐతో విభేదాల వ‌ల్ల త‌ప్పుకున్నాడ‌ని పేర్కొంటే మంచి పని చేశాడంటూ కితాబు ఇచ్చారు. ఈ త‌రుణంలో మొద‌టి వ‌న్డేలో హాఫ్ సెంచ‌రీ సాధించినా త‌న జ‌ట్టుకు విజ‌యం చేకూర్చ లేక పోయాడు కోహ్లీ.

ఈ త‌రుణంలో ద‌క్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెట‌ర్ అల‌న్ డొనాల్డ్ (Allan Donald )ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ఆట‌గాడు అంటూ పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు త‌న పూర్వ ఆట తీరును ప్ర‌ద‌ర్శించ‌డం ఖాయ‌మ‌న్నాడు.

ప్ర‌స్తుతానికి ఫామ్ లేమితో ఉన్న‌ప్ప‌టికీ ఒక్క‌సారి టైమ్ కుదిరిందంటే ఇక కోహ్లీని ఆప‌డం ఎవ‌రి త‌రం కాద‌ని పేర్కొన్నాడు డొనాల్డ్. అత‌డు నాయ‌కుడిగానే కాదు ఆట‌గాడిగా కూడా వెరీ వెరీ స్పెష‌ల్. ఎక్క‌డా త‌గ్గ‌డం అనేది ఉండ‌ద‌న్నాడు.

ఇదే అత‌డిని ఇత‌ర ప్లేయ‌ర్ల కంటే భిన్నంగా నిల‌బ‌డుతుంద‌న్నాడు. గొప్ప వాళ్లుగా భావించే ప్ర‌ముఖ క్రికెట‌ర్లంతా ఒక్కోసారి ప‌త‌నానికి గురైన వాళ్లేన‌ని గుర్తు చేశాడు. ఆట‌లో ఎవ‌రు ఎప్పుడు ఫామ్ లోకి వ‌స్తారో ఎవ‌రు ఎప్పుడు ఫెయిల్ అవుతారో చెప్ప‌డం క‌ష్ట‌మ‌న్నాడు.

ఏది ఏమైనా కోహ్లీ లాంటి ఆట‌గాడు ప్ర‌స్తుతం ఇబ్బంది ప‌డ్డా ప‌రుగులు చేసేందుకు త్వ‌ర‌లోనే త‌న ర‌న్స్ దాహాన్ని తీర్చు కోవ‌డం ఖాయ‌మ‌న్నాడు. ఆనాడు అత‌డిని త‌ట్టు కోవ‌డం క‌ష్ట‌మ‌న్నాడు అల‌న్ డొనాల్డ్.

Also Read : రాహుల్ కెప్టెన్సీపై సన్నీ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!