Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ ఈ పేరు గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. భారత క్రికెట్ జట్టుకు మూల స్తంభంగా ఉంటూ వచ్చాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతడికంటూ ఓ పేజీ ఉంది.
ద్రవిడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి వివాదాస్పదాల జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లడం ఆయన నైజం. ఇదే ఆయనను ఉన్నత స్థానంలో నిలిచేలా చేసింది.
కామ్ గా ఉండటం, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించడం ఇదీ ద్రవిడ్(Rahul Dravid) వ్యక్తిత్వం గురించి చెప్పాల్సి వస్తే.
ఎవరినైనా విమర్శించేందుకు తాజా, మాజీ ఆటగాళ్లు సాహసిస్తారు కానీ రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడేందుకు జంకుతారు.
కామెంట్ చేసేందుకు సైతం ఒప్పుకోరు. కారణం అతడి వ్యక్తిత్వం.
ఎవరినీ నొప్పించక తాను మాత్రం వెరీ స్పెషల్ గా ట్రైనింగ్ ఇవ్వవడం తనకు తనే సాటి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.
ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు. ఇండియన్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా కొన్నేళ్ల పాటు దానిని అద్భతంగా తీర్చిదిద్దాడు.
ఇవాళ భారత జట్టులో కీలక ఆటగాళ్లంతా ఒకప్పుడు తన పర్యవేక్షణలో, తన ట్రైనింగ్ లో ఆరి తేరిన వాళ్లే.
ఉన్నట్టుండి బీసీసీఐ చీఫ్ గా దాదా వచ్చాక సీన్ మారింది. ద్రవిడ్ (Rahul Dravid)ప్రయారిటీ పెరిగింది.
బీసీసీఐలో గంగూలీ ఏది చెబితే అదే వేదం. ఎలాంటి అనుమానాలకు, అక్రమాలకు, అవినీతికి తావు లేకుండా చూడడంలో ఆయన ఎక్స్ పర్ట్.
అందుకే దాదా అంటే చాలా మందికి అభిమానం.
సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు హెడ్ కోచ్ గా విశిష్ట సేవలు అందించిన రవిశాస్త్రి గుడ్ బై చెప్పాడు.
ఆ తర్వాత ఏడేళ్లకు పైగా భారత జట్టుకు నాయకుడిగా ఎనలేని విజయాలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు.
ఈ తరుణంలో ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు ద్రవిడ్. మొదట్లో ఒప్పుకోక పోయినా గత్యంతరం లేక గంగూలీ , జేషా కోరడంతో ఓకే చెప్పాడు.
స్వదేశంలో కీవీస్ తో సీరీస్ నెగ్గినా సఫారీ టూర్ మాత్రం ద్రవిడ్ కు పీడకలగా మారిందనడంలో సందేహం లేదు.
మిస్టర్ కూల్ గా పేరొందిన ది వాల్ ప్రయత్నాలు ఏ మాత్రం వర్కవుట్ కాలేదన్నది ఈ సీరీస్ లో తేలి పోయింది. ప్రధానంగా ఏరికోరి తాత్కాలిక సారథ్య బాధ్యతలు కేఎల్ రాహుల్ కు అప్పగించినా వర్కవుట్ కాలేదు.
ఏది ఏమైనా టీమిండియా గాడిలో పడాలంటే ఇంకాస్త మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నది వాస్తవం.
Also Read : గుజరాత్ రైతు విజయ గాధ