Imran Tahir : దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ సంచలన కామెంట్స్ చేశాడు. సఫారీ టీమ్ తో రెండో వన్డే సైతం భారత్ ఓడి పోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత ఆటగాళ్లు మితి మీరిన ఆత్మ విశ్వాసం వల్లే ఆడ లేక పోయారని అందుకే పరాజయం పాలయ్యారంటూ పేర్కొన్నాడు. కనీసం భారత బౌలర్లు సఫారీ ఆటగాళ్లను పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ కాలేక పోయారని స్పష్టం చేశాడు.
ఇక్కడి పిచ్ లు భారత్ పిచ్ లు లాగా ఉండవన్న విషయం తెలిసి కూడా ఆటగాళ్లు సరైన ప్రాక్టీస్ చేయ లేదని పేర్కొన్నాడు. ఏది ఏమైనా జాగ్రత్తగా ఆడాల్సిన ఆటగాళ్లు తమంతటి వాళ్లు ఎవరూ లేరన్న గొప్పకు పోయి ఉన్న వికెట్లను పారేసుకున్నారని మండిపడ్డాడు ఇమ్రాన్ తాహిర్(Imran Tahir).
మూడు టెస్టుల సీరీస్ తో పాటు వన్డే సీరీస్ పోగొట్టు కోవడానికి ప్రధాన కారణం అతి విశ్వాసం తప్ప మరొకటి కాదని తేల్చి చెప్పాడు. దీనిని ఎంత తగ్గించుకుంటే టీమిండియాకు అంత మంచిదని సూచించాడు ఈ సఫారీ మాజీ స్పిన్నర్.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇమ్రాన్ తాహిర్ ఓమన్ లో ఉన్నాడు. ఆయన లెజెండ్ క్రికెట్ లీగ్ వరల్డ్ జెయింట్స్ జట్టులో సభ్యుడు. నేను ఏ జట్టు గొప్పదని పేర్కొనను.
అయితే వన్డే, టెస్టు సీరస్ పరంగా చూస్తే భారత జట్టు అద్భుతమైన జట్టు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్లను కొంప ముంచేలా చేసిందని మాత్రం చెప్పేందుకు వెనుకాడనని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఇమ్రాన్ తాహిర్ చేసిన కామెంట్స్ భారత జట్టు శిబిరంలో కలకలం రేపాయి.
Also Read : తగ్గేదేలే అంటున్న వార్నర్ భయ్యా