IPL 2022 Auction : భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి ఇవాళ వేలం పాటకు రెడీ అని ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు వేదికగా వేలం పాట నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం (IPL 2022 Auction )నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది.
ఇందు కోసం ఆయా జట్లకు సంబంధించి మొత్తం 1214 మంది ప్లేయర్లు ఆక్షన్ లో పాల్గొంటారని తెలిపింది బీసీసీఐ.
ఇదిలా ఉండగా గత ఐపీఎల్ 2021 వరకు కేవలం 8 ఫ్రాంచైజీలకు సంబంధించిన జట్లు మాత్రమే పాల్గొనేవి.
కానీ ఈసారి ఐపీఎల్ పాలక మండలి కీలక సమావేశం నిర్వహించింది.
ఇందులో భారీ వేలం పాట నిర్వహించింది. కొత్తగా రెండు జట్లు చేరాయి. ఒకటి అహ్మదాబాద్ కాగా రెండోది లక్నో.
ఐపీఎల్ లో భారీ ధరకు కొనుగోలు చేసింది కేఎల్ రాహుల్ ను లక్నో జట్టు. ఆ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 17 కోట్లు పెట్టి తీసుకుంది.
ఈసారి వేలం పాటలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది బీసీసీఐ.
వేలం పాటలో పేర్లు నమోదు చేసుకునేందుకు ఈనెల 20 వరకు డెడ్ లైన్ విధించింది.
దీంతో వేలం పాటలో పాల్గొనే తుది ఆటగాళ్ల జాబితాను(IPL 2022 Auction )డిక్లేర్ చేసింది.
మొత్తం 1214 మంది ఆటగాళ్లలో 896 మంది భారత దేశానికి చెందిన ఆటగాళ్లు ఉండగా 318 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
వీరిలో 270 మంది జాతీయ జట్టుకు ఆడిన వారుంటే 903 మంది నేషనల్ టీంకు ఆడని వారున్నారని వెల్లడించింది బీసీసీఐ.
విదేశీ ఆటగాళ్ల పరంగా చూస్తే ఆసిస్ నుంచి 59 మంది, సౌతాఫ్రికా నుంచి 48, శ్రీలంక నుంచి 36, ఇంగ్లండ్ నుంచి 30, కీవీస్ నుంచి 29, ఆఫ్గన్ నుంచి 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.
నేపాల్ నుంచి 15, యుఎస్ఏ నుంచి 14, నమీబియా నుంచి 5, ఒమన్ నుంచి 3, భూటాన్ , యూఏఈ, నెదర్లాండ్, స్కాట్లాండ్ నుంచి ఒక్కొరక్కరి చొప్పున ఉన్నారు.
Also Read : అతడి సేవలు జట్టుకు అవసరం