Subhash Chandra Bose : భారత జాతీయ సైన్యాధినేత. స్వాతంత్ర సమర యోధుడు. దేశం మరిచి పోని ధీరోదాత్తుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర బోస్(Subhash Chandra Bose )పుట్టిన రోజు. జనవరి 23న 1897లో జన్మించారు.
1945 ఆగస్టు 18న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఓ వైపు గాంధీ అహింసతోనే దేశానికి స్వాతంత్రం లభిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారానే నమ్మాడు.
ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని ఆచరణలో పెట్టిన వాడు.
సుభాష్ చంద్ర బోస్ రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నికైనా గాంధీతో పొసగక రాజీనామా చేశాడు.
వాల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు బోస్(Subhash Chandra Bose ). 11 సార్లు అరెస్ట్ అయ్యాడు.
1939లో రెండో ప్రపంచ యుద్దం సందర్భంగా ఆంగ్లేయులను దెబ్బ కొట్టాలని భావించాడు.
రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సాయంతో భారత యుద్ద ఖైదీలు, రబ్బరు తోట కూలీలు,
ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని సింగపూర్ లో ఏర్పాటు చేశాడు.
బోస్ తండ్రి తీవ్రమైన జాతీయవాది. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనల్లో మార్పులు వచ్చాయి.
స్వతంత్ర దేశంగా అవతరించాలంటే ఇతర దేశాల సహకారం అవసరమని గ్రహించాడు.
బోస్ హిట్లర్ ను కూడా కలిశాడు. ఈ సందర్బంగా బోస్ అన్న మాటలు సంచలనం కలిగించాయి. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్ కు తప్ప ఇంకెవ్వరికీ లేదన్నాడు.
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాడు. బోస్ ను మట్టుబెట్టేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ప్లాన్ వేసింది. జర్మనీలో జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో స్టార్ట్ చేశాడు.
4 వేల 500 మంది సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. 1944 జూలై 4న బర్మాలో జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో సుభాష్ చంద్ర బోస్ చేసిన ప్రసంగం కీలకమైంది.
మీ రక్తాన్ని ధార పోయండి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తానని అన్నాడు. తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా ఆయన కనిపించకుండా పోయాడు.
భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ ఈరోజు వరకు ఈ యోధుడి మరణం అనుమానాస్పదంగానే మిగిలి పోయింది.
Also Read : మాన్’ మామూలోడు కాదప్పా