Raj Bawa : అండర్ -19 వరల్డ్ కప్ లో భారత జట్టు దుమ్ము రేపుతోంది. అత్యధిక వ్యక్తిగత స్కోరర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ పేరుతో ఉన్న రికార్డును రాజ్ బావా (Raj Bawa)తిరగ రాశాడు.
ఉగండాతో జరిగిన మ్యాచ్ లో ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఏకంగా 162 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. గతంలో కెన్యాపై 2004లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో 155 పరుగులు చేశాడు శిఖర్ ధావన్.
ఇంత కాలం ఆ రికార్డు అతడి పేరుపైనే నమోదై ఉంది. రఘువంశీతో కలిసి రాజ్ బావా దుమ్ము రేపాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 206 పరుగులు జోడించారు.
భారత జట్టు ఇన్నింగ్స్ లో 400కి పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ అండర్ -19 ప్రపంచ కప్ లో భారత దేశం సాధించిన 405 పరుగుల స్కోరే అత్యధికంగా నమోదై ఉంది.
గగతంలో 2004లో టీమిండియా 425 పరుగులు చేసింది. ప్రస్తుతం మన జట్టు 405 పరుగులు చేసింది. భారత్ ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. కరోనా కారణంగా కెప్టెన్ యష్ ధుల్ ఆటకు దూరంగా ఉన్నాడు.
అయినా మన ఆటగాళ్లు ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. నాలుగు సార్లు వరల్డ్ కప్ టైటిల్ ను గెలుచుకుని అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
చివరి సారిగా 2020లో ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని అండర్ -19 జట్టు రన్నరప్ గా నిలువగా బంగ్లాదేశ్ టీం మొదటిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ స్వంతం చేసుకుంది.
Also Read : ఇండియా లోనే ఐపీఎల్ – 2022