India U19 vs Uganda U19 : ఓ వైపు భారత సీనియర్లు తలవంచితే అండర్ -19 భారత జట్టు కుర్రాళ్లు దుమ్ము రేపారు. ఏకంగా వరల్డ్ కప్ లో ఉగండాపై 326 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. రాజ్ బావా, రఘువంశీ లు కలిసి దుమ్ము రేపారు.
ఉగండాకు చుక్కలు చూపించింది. బ్రియన్ లారా స్టేడియంలో జరిగిన మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరర్ గా రాజ్ బావా చరిత్ర సృష్టించాడు.
రాజ్ బావా, రఘువంశీ కలిసి మూడో వికెట్ కు 206 పరుగులు జోడించారు. భారత జట్టు(India U19 vs Uganda U19) ఏకంగా 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం విశేషం.
వీరిద్దరూ సెంచరీలతో మోత మోగించారు. ఈ విజయంతో భారత జట్టు గ్రూప్ – బిలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈనెల 29న జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ ఆడుతుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ టార్గెట్ ముందుంచింది. దీంతో బరిలోకి దిగిన ఉగండా నిర్ణీత 20 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌటైంది. భారత్ జట్టు తరపున కెప్టెన్ నిషాంత్ సింధు నాలుగు వికెట్లు తీశాడు.
ఇదిలా ఉండగా రాజ్ బావా, రఘువంశీ వరుసగా 162, 144 పరుగులు చేశారు. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారత్ 405 పరుగులు చేసింది. రాజ్ బావా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
గతంలో అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా 2004లో జరిగిన మ్యాచ్ లో భారత్ అత్యధికంగా 425 పరుగులు చేసింది.
Also Read : టీమిండియాలో జోష్ కరువైంది