PV Sindhu : తెలుగు వారి అమ్మాయి పీవీ సింధు మరో ఘనతను సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆమె మాళవిక బన్సోడ్ ను ఓడించింది. దీంతో సయ్యద్ మోదీ అంతర్జాతీయ టైటిల్ ను కైవసం చేసుకుంది.
పైనల్ మ్యాచ్ లో వరుస గేమ్ లలో మాళవికను మట్టి కరిపించింది స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu). గతంలో టైటిల్ గెలుపొందిన మాళవికను ఓడించడం విశేషం. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేతగా ఉన్నారు సింధు.
ఇవాళ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో తన రెండో మహిళల సింగిల్స్ టైటిల్ ను గెల్చుకుంది. మాళవిక బన్సోద్ కు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు పీవీ సింధు.
టాప్ సీడ్ గా ఉన్న పీవీ సింధు బన్సోద్ పై 21-13, 21-16 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ కేవలం 35 నిమిషాల పాటు మాత్రమే కొనసాగడం విశేషం.
2017 తరర్వాత మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధుకు ఇది రెండో ఇంటర్నేషనల్ సయ్యద్ మోదీ టైటిల్ గెలుపొందడం. అంతకు ముందు మిక్స్ డ్ బబుల్స్ లో ఏడో సీడ్ ఇషాన్ భట్నాగర్ , తనీషా క్రాస్టో స్వదేశీయులైన టి. హేమ నాగేంద్ర బాబు, శ్రీ వేద్య గురజాడపై వరుస గేమ్ ల విజయంతో టైటిల్ ను కైవసం చేసుకున్నారు.
29 నిమిషాల్లో ముగిసిన పోరులో భట్నాగర్ క్రాస్టో 21-16, 21-12 తేడాతో అన్ సీడెడ్ భారత జోడీపై గెలుపొందారు. అంతకు ముందు ఆర్నాడ్ మెర్కిల్, లూకాస్ క్లార్ బౌట్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో అర్ధాంతరంగా నిలిపి వేశారు.
Also Read : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్