Harbhajan Singh :భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
గత కొంత కాలంగా టీమిండియాకు టీ20, వన్డే, టెస్టు లకు కెప్టెన్ గా ఉన్న కోహ్లీని చూసీ చూడనట్లు వదిలేశారని కానీ ఇప్పుడు అందరి కళ్లు అతడి ఆట తీరుపై ఉంటుందన్నాడు. ఒక రకంగా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు.
ఆటగాడిగా తీవ్ర ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతున్న విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఆడక పోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఇకనైనా ప్లేయర్ గా పరుగులు చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించాడు.
లేదంటే జట్టులో చోటు దక్కే చాన్స్ ఉండక పోవచ్చంటూ వార్నింగ్ ఇచ్చాడు. తాను వ్యక్తిగతంగా దూషించడం లేదని కానీ ఓ సీనియర్ ఆటగాడిగా చెప్పక తప్పదన్నాడు.
ఇక నుంచి విరాట్ కోహ్లీ అహాన్ని పక్కన పెట్టి పూర్తిగా వంద శాతం ఆటపై ఫోకస్ చేయాలని సూచించాడు. గతంలో ఒకరిని వదులుకుంటే ఎలా అని ఇంకో ఆటగాడి కోసం వేచి చూసే వారని కానీ ఇప్పుడు సెలెక్టర్లకు ఆ పని తప్పిందన్నాడు.
ఐపీఎల్ పుణ్యమా అని దమ్మున్న ఆటగాళ్లు ఎందరో రెడీగా ఉన్నారని దీంతో ప్రతి మ్యాచ్ కోహ్లీకి కీలకంగా మారనుందని స్పష్టం చేశాడు హర్భజన్ సింగ్(Harbhajan Singh ).
ఇదిలా ఉండగా బీసీసీఐ చీఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి మరింత ప్రమాదంలోకి నెట్టి వేయబడ్డాడు కోహ్లీ. సఫారీతో జరిగిన ఫస్ట్ వన్డేలో రాణించినా రెండో వన్డేలో సున్నాకే వెనుదిరిగాడు. ఈ తరుణంలో భజ్జీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : కోహ్లీని కావాలనే తప్పించారు