Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రపంచ క్రికెట్ లో ఆయనకు స్పెషల్ స్థానం ఉంది. వేల పరుగులు సాధించిన క్రికెటర్ గానే కాకుండా వ్యక్తిగతంగా ఆదర్శనీయమైన క్రికెటర్(Rahul Dravid) గా పేరొందాడు.
ఆయనను ఏరికోరి భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తీసుకు వచ్చాడు హెడ్ కోచ్ గా.
ఉన్నట్టుండి యూఏఈలో జరిగిన ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి భారత క్రికెట్ జట్టులో.
వెను వెంటనే సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు రవిశాస్త్రి.
దూకుడుతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న విరాట్ కోహ్లీని తప్పుకునేలా చేశారు.
వీరిద్దరి కాంబినేషన్ లో భారత జట్టు ఎనలేని విజయాలు నమోదు చేసినా
అదే స్థాయిలో వీరిద్దరూ ఒన్ మెన్ షో గా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
అంతే కాదు బీసీసీఐ పెదల్ని బేఖాతర్ చేస్తూ ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ప్రవర్తించారన్న విమర్శలు ఉన్నాయి.
దీంతో దాదా రంగంలోకి దిగాక వీరిద్దరికీ చెక్ పెట్టడం స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ అకాడెమీతో సుదీర్ఘ కాలం పాటు అనుబంధం కలిగి ఉన్న ద్రవిడ్ (Rahul Dravid)కు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించాడు దాదా.
స్వదేశంలో కీవీస్ తో జరిగిన టూర్ లో కొంత ఫలితం కనిపించినా సఫారీ టూర్ మాత్రం ద్రవిడ్ కు పీడకల గానే మిగిలింది అన్నది చెప్పక తప్పదు.
రవిశాస్త్రి లాగా దూకుడు మనస్తత్వం కాదు రాహుల్(Rahul Dravid) ది. చాలా కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇదే భారత జట్టును కొంప ముంచిందన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజా, మాజీ ఆటగాళ్లు ఎవరూ ద్రవిడ్ ను అనేందుకు సాహసించరు. ఎందుకంటే అతడు 100 శాతం ఎఫర్ట్ పెడతాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.
కానీ కాస్తా మెతక వైఖరి తగ్గించుకుంటే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read : రాణిస్తే ఓకే లేదంటే చోటు కష్టం