Team India : భారత జట్టులో అంతా స్టార్ ఆటగాళ్లే. కానీ ఏ ఒక్కరు జట్టును గెలిపించ లేక పోతున్నారు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ కు అలవాటు పడిన వీళ్లు ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఎలా ఆడతారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లిన భారత జట్టు పరాజయాలను మూట గట్టుకుంది.
హాట్ ఫేవరేట్ గా వెళ్లిన టీమిండియా (Team India)పూర్తిగా అన్ని ఫార్మాట్ లలో పేలవమైన ఆట తీరుతో చేజేతులారా ఓటమిని చవి చూసింది.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు భారత జట్టులో ఎడ తెరిపి లేకుండా మార్పులు చేయడం కూడా ఒకింత ప్రభావం కనిపిస్తోంది.
ప్రధానంగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో సత్తా చాటిన ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ లో దారుణమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ప్రత్యేకించి చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ జట్టుపై గెలుస్తుందని అనుకున్న వాళ్లకు ఏకంగా 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
కోట్లాది మంది భారతీయుల గుండెల్ని గాయం చేసింది భారత జట్టు(Team India). కోట్లపై ఉన్నంత ధ్యాస ఇంటర్నేషనల్ మ్యాచ్ లపై లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లకు ఐపీఎల్ పైనే ఎక్కువ మోజు అని సంప్రదాయ మ్యాచ్ లపై వారికి ఆసక్తి లేకుండా పోతోందని పేర్కొన్నాడు.
అది నిజమేనని అనిపిస్తోంది. ఐపీఎల్ పూర్తిగా రిచ్ లీగ్. కానీ టీ20, వన్డే, టెస్టు మ్యాచ్ లు కూడా ఆడాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా ఐసీసీ ప్రకటించిన టీ20 వరల్డ్ టీంలో పాకిస్తాన్ స్కిప్పర్ బాబర్ ఆజమ్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
కానీ భారత జట్టుకు చెందిన ఒక్క ప్లేయర్ కు చోటు దక్కలేదు. దీంతో దాయాది కొట్టిన దెబ్బ నుంచి ఇంకా మనోళ్లు తేరుకోలేదని అనిపిస్తోంది. .
ఇకనైనా ఆట తీరు మార్చుకుంటే బెటర్. లేకుండా ఐపీఎల్ కే పరిమితం కావాల్సి వస్తుంది.
Also Read : యోధుడా నిను మరువదు ఈ గడ్డ